Jailer 2 Weeks Collections: 124 కోట్ల సినిమా.. 2 వారాల్లోనే వందల కోట్లు ఉఫ్.. లాభాలతో పెను సంచలనం

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇండియన్ సినీ చరిత్రలోనే ఈ పేరు ఒక సెన్సేషన్. అంతలా ఆయన దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులు అలరిస్తున్నారు. ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం తగ్గకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే, చాలా కాలంగా హిట్‌కు దూరంగా ఉన్న తలైవా.. ఇటీవలే 'జైలర్' అనే సినిమాతో వచ్చారు. దీనికి ఆరంభం నుంచీ అదిరిపోయే స్పందన దక్కుతోంది. ఫలితంగా అప్పటి నుంచీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో 'జైలర్' 2 వారాల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి!

సూపర్ స్టార్ జైలర్‌ మారితే:సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించిన సినిమానే 'జైలర్'. తీసిన ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వినాయకన్, వసంత్ రవి ప్రధాన పాత్రలను చేశారు. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని ఇచ్చాడు. అలాగే తమన్నా, సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు కూడా నటించారు.

 Rajinikanth Starrer Jailer Movie 2 Weeks Worldwide Official Collections

జైలర్ మూవీకి బిజినెస్ ఇలా:ప్రకటన సమయం నుంచే 'జైలర్' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా హక్కులకు వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ జరిగింది.

14వ రోజు తెలుగులో వసూళ్లు:'జైలర్' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 14వ రోజు మరింత డౌన్ అయింది. ఫలితంగా నైజాంలో రూ. 21 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 49 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

 Rajinikanth Starrer Jailer Movie 2 Weeks Worldwide Official Collections

14 రోజులకు కలిపి ఎంతంటే:14 రోజుల్లో 'జైలర్' ఏపీ, తెలంగాణలో ఊహించని స్పందన అందుకుంది. ఫలితంగా నైజాంలో రూ. 20.22 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.64 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.50 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.88 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.64 కోట్లు, గుంటూరులో రూ. 2.92 కోట్లు, కృష్ణాలో రూ. 2.56 కోట్లు, నెల్లూరులో రూ. 1.27 కోట్లతో.. రూ. 42.63 కోట్లు షేర్, రూ. 72.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

 Rajinikanth Starrer Jailer Movie 2 Weeks Worldwide Official Collections

తెలుగులో ఎన్ని కోట్ల లాభం:యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'జైలర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తద్వారా ఈ చిత్రం రూ. 13 కోట్లు మేర బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ మూవీ 14 రోజుల్లోనే రూ. 42.63 కోట్లు రాబట్టింది. ఫలితంగా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 29.63 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుని సత్తా చాటింది.

 Rajinikanth Starrer Jailer Movie 2 Weeks Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు:'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రాణించింది. దీంతో 14 రోజుల్లో తెలుగులో రూ. 73.20 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 157.65 కోట్లు, కర్నాటకలో రూ. 62.60 కోట్లు, కేరళలో రూ. 48.70 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 13.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 179.30 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 535.10 కోట్లు గ్రాస్‌, రూ. 261.80 కోట్లు షేర్ వచ్చింది.

 Rajinikanth Starrer Jailer Movie 2 Weeks Worldwide Official Collections

ఓవరాల్‌గా లాభం ఎంతంటే:తలైవా రజినీకాంత్ హీరోగా నటించిన 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 122.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇది రూ. 124 కోట్లు షేర్ టార్గెట్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చింది. ఇక, ఈ చిత్రం 14 రోజుల్లో రూ. 261.80 కోట్లు రాబట్టింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 137.80 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X