Jailer 3 Days Collections: శనివారం ఊహించని వసూళ్లు.. అన్ని వందల కోట్లు ఔట్.. తలైవా సంచలన రికార్డు

సౌతిండియా మొత్తంలో ఏజ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే సీనియర్ హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. విలక్షణమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆయన.. ఇప్పటికీ అదే వేగంతో సినిమాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు తలైవా 'జైలర్' అనే మూవీతో వచ్చారు. దీనికి వసూళ్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. ఇలా మూడో రోజూ ఈ చిత్రం దుమ్ముదులిపేసింది. మరి 'జైలర్'కు ఇప్పటి వరకూ ఎన్ని కోట్లు వచ్చాయో మీరే చూడండి!

జైలర్‌గా రజినీకాంత్ ఎంటర్: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన సినిమానే 'జైలర్'. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేయగా.. తమన్నా హీరోయిన్‌గా నటించింది. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించారు.

Rajinikanth Starrer Jailer Movie 3 Days Worldwide Official Collections

జైలర్ మూవీకి బిజినెస్ ఇలా: ఆరంభం నుంచీ 'జైలర్' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ జరిగింది.

3వ రోజు తెలుగులో వసూళ్లు:'జైలర్' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3వ రోజూ సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 1.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 48 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 54 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 30 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 31 లక్షలు, కృష్ణాలో రూ. 30 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో.. రూ. 4.15 కోట్లు షేర్, రూ. 7.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

3 రోజులకు కలిపి ఎంతంటే: 'జైలర్' మూవీ ఏపీ, తెలంగాణలో మూడు రోజుల్లో దుమ్ము లేపింది. ఫలితంగా నైజాంలో రూ. 6.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.78 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.71 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 92 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 57 లక్షలు, గుంటూరులో రూ. 1.12 కోట్లు, కృష్ణాలో రూ. 93 లక్షలు, నెల్లూరులో రూ. 42 లక్షలతో.. రూ. 13.81 కోట్లు షేర్, రూ. 23.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

Rajinikanth Starrer Jailer Movie 3 Days Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు: 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. దీంతో 3 రోజుల్లో తెలుగులో రూ. 24.50 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 59.10 కోట్లు, కర్నాటకలో రూ. 22.75 కోట్లు, కేరళలో రూ. 16.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 87.44 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 214.15 కోట్లు గ్రాస్‌, రూ. 105.10 కోట్లు షేర్ వచ్చింది.

ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?: 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 122.50 కోట్ల బిజినెస్ చేసుకుని రూ. 124 కోట్లు షేర్ టార్గెట్‌తో వచ్చింది. ఇది 3 రోజుల్లో రూ. 105.10 కోట్లు రాబట్టింది. అంటే.. ఇంకా 18.90 కోట్లు వసూలు చేయాలి. అలాగే, తెలుగులో రూ. 12 కోట్లు బిజినెస్.. రూ. 13 కోట్లు టార్గెట్‌తో వచ్చింది. 3 రోజుల్లో ఇది రూ. 13.81 కోట్లు రాబట్టడంతో రూ. 81 లక్షలు లాభాలను సొంతం చేసుకుంది.

Rajinikanth Starrer Jailer Movie 3 Days Worldwide Official Collections

తలైవా ఖాతాలో రికార్డులు: 'జైలర్' మూవీకి వసూలు పోటెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగులో ఈ చిత్రం మూడు రోజుల్లోనే టార్గెట్‌ను చేరుకుని ఈ ఏడాది 16వ క్లీన్ హిట్ మూవీగా నిలిచింది. తద్వారా 13 ఏళ్ల తర్వాత తెలుగులో రజినీకాంత్ విజయాన్ని అందుకున్నారు. అలాగే ఓవర్సీస్‌లో 3.25 మిలియన్ డాలర్లను దాటింది. అంతేకాదు, 200 కోట్లు గ్రాస్, 100 కోట్లు షేర్‌తో సత్తా చాటింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X