Jailer 3 Weeks Collections: 124 కోట్లు సినిమా.. 3 వారాల్లో అన్ని వందల కోట్లు.. లాభం చూస్తే మెంటలే!
ఇండియాలో ఇప్పుడు చాలా మందే పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. కానీ, చాలా కాలం క్రితమే దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుని నేషనల్ స్టార్ అనిపించుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇలా దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న ఆయన.. ఈ మధ్య కాలంలో కాస్త వెనుకబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే 'జైలర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి ఊహించని విధంగా వసూళ్లు పోటెత్తాయి. ఇలా ఇది మూడు వారాల్లో దుమ్ము దులిపేసింది. మరి 'జైలర్' మూవీ 21 రోజుల రిపోర్టును మీరే చూడండి!
జైలర్‌గా రజినీకాంత్ ఎంటర్:సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన మూవీనే 'జైలర్'. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వినాయకన్, వసంత్ రవి ప్రధాన పాత్రలను చేయగా.. తమన్నా, సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు.

జైలర్ మూవీకి బిజినెస్ ఇలా:యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'జైలర్' మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా హక్కులకు వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ జరిగింది.
21వ రోజు తెలుగులో వసూళ్లు:'జైలర్' మూవీ 21వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మళ్లీ పుంజుకుంది. ఫలితంగా నైజాంలో రూ. 19 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 34 లక్షలు షేర్, రూ. 70 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

21 రోజులకు కలిపి ఎంతంటే:21 రోజుల్లో 'జైలర్' ఏపీ, తెలంగాణలో భారీ స్పందన అందుకుంది. ఫలితంగా నైజాంలో రూ. 21.99 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.00 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.88 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.13 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.78 కోట్లు, గుంటూరులో రూ. 3.10 కోట్లు, కృష్ణాలో రూ. 2.75 కోట్లు, నెల్లూరులో రూ. 1.38 కోట్లతో.. రూ. 46.01 కోట్లు షేర్, రూ. 78.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

తెలుగులో ఎన్ని కోట్ల లాభం:క్రేజీ కాంబోలో వచ్చిన 'జైలర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తద్వారా ఈ చిత్రం రూ. 13 కోట్లు మేర బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ మూవీ 21 రోజుల్లోనే రూ. 46.01 కోట్లు రాబట్టింది. ఫలితంగా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 33.01 కోట్లు లాభాలను అందుకుని సరికొత్త రికార్డును నమోదు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు:ప్రపంచ వ్యాప్తంగా 'జైలర్' దుమ్ము దులిపింది. దీంతో 21 రోజుల్లో తెలుగులో రూ. 79.65 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 179.10 కోట్లు, కర్నాటకలో రూ. 67.05 కోట్లు, కేరళలో రూ. 53.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 15.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 191.40 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 586.45 కోట్లు గ్రాస్, రూ. 286.35 కోట్లు షేర్ వచ్చింది.

ఓవరాల్‌గా లాభం ఎంతంటే:రజినీ - నెల్సన్ కలిసి చేసిన 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 122.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇది రూ. 124 కోట్లు షేర్ టార్గెట్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చింది. ఇక, ఈ చిత్రం 21 రోజుల్లో రూ. 286.35 కోట్లు రాబట్టింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 162.35 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











