Jailer 4 Days Collections: బాక్సాఫీస్ వద్ద రజినీ జైలర్ ప్రభంజనం.. 4 రోజుల్లోనే 300కోట్లు.. ఎంత లాభమో తెలుసా?
రజనీ కాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. కళానిధి మారన్ నిర్మించారు. ఇక మూవీ నాలుగు రోజుల్లోనే రికార్డు వసూళ్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ ఓ సారి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జైలర్ సినిమా 4 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రభంజనం సృష్టించారు. జైలర్ మూవీ 4వ రోజు అన్ని ప్రధాన ఏరియాల్లో సూపర్ వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో జైలర్ మూవీ మొదటి రోజు రూ.7.01 కోట్ల వసూళ్లు సాధించగా.. రెండో రోజు రూ. 2.65 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు రూ. 4.15 కోట్లు రాబట్టింది. ఇక నాలుగువ రోజు రూ. 5.12 కోట్లు వసూలు చేసి.. మొత్తంగా రూ.18.93 కోట్ల నెట్ వసూలు చేయగా.. రూ.33.15 కోట్ల గ్రాస్ రాబట్టింది.

జైలర్ సినిమా 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పరిశీలిస్తే... నైజాం రూ.2.32 కోట్లు, సీడెడ్: రూ.63 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 64 లక్షలు, తూర్పు ఆంధ్రలో 42 లక్షలు, పశ్చిమ రూ. 21 లక్షలు, గుంటూరు రూ. 39 లక్షలు, కృష్ణ రూ.33 లక్షలు, నెల్లూరు రూ. 18 లక్షలు వసూళ్లు రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రల్లో మొత్తంగా... రూ.5.12 నెట్ వసూలు చేయగా.. రూ.9.50 కోట్ల గ్రాస్ రాబట్టింది.
జైలర్ సినిమా 4 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ పరిశీలిస్తే... నైజాం రూ. 8.67 కోట్లు, సెడెడ్ రూ.2.41కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.35 కోట్లు, తూర్పు రూ.1.34 కోట్లు, పశ్చిమ: రూ. 78 లక్షలు, గుంటూరు రూ.1.52 కోట్లు, కృష్ణ: రూ.1.26 కోట్లు, నెల్లూరు రూ.60 లక్షలు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా.. రూ.18.93 నెట్ వసూలు చేయగా.. రూ.33.15 గ్రాస్ వసూలు చేసింది.తెలుగు స్టేట్స్ లో జైలర్ సినిమా మొత్తం వ్యాపారం రూ.12కోట్లు వ్యాపారం చేయగా... బ్రేక్ ఈవెన్ రూ.13 కోట్లుగా నమోదు జరిగింది. అయితే ఈ సినిమా మొత్తం రూ. 5.93 కోట్ల లాభంతో దూసుకువెళ్తోంది.

జైలర్ 4 రోజుల ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ రిపోర్ట్ గమనిస్తే... తమిళనాడు రూ. 82.05 కోట్లు వసూలు చేయగా... తెలుగు రాష్ట్రాలు రూ. 34.10 కోట్లు వసూలు చేసింది. కర్ణాటక రూ. 31.90 కోట్లు కొల్లగొట్టగా.. కేరళ రూ.23.20 కోట్లు రాబట్టింది. రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ రూ. 4.50 కోట్లు కాగా... ఓవర్సీస్ రూ.125.50 కోట్లు వసూలు చేసింది. మొత్తం ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ చూసుకుంటే... రూ.301.25 కోట్ల గ్రాస్ వసూలు చేయగా... రూ.148.15 షేర్ రాబట్టింది.

రజినీ నటించిన ఈ జైలర్ సినిమా మొత్తం వాల్యూడ్ బిజినెస్ రూ.122.50 కోట్లుగా నమోదు అయింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రూ.124కోట్లు. ఇక ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఈ సినిమా లాభాల్లో దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటికి 24.15 కోట్ల లాభంతో దూసుకుపోతుంది.


Click it and Unblock the Notifications











