Jailer 5 Days Collections: వర్కింగ్ డే ఉన్నా భారీగా.. భోళా కంటే పది రెట్లు ఎక్కువ.. వందల కోట్లు ఔట్
అదిరిపోయే నటన, ఆకట్టుకునే ఫైట్స్, అన్నింటికి మించి విభిన్నమైన స్టైల్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సుదీర్ఘ కాలంగా పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతోన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ఆయన.. హిట్లు మాత్రం పెద్దగా అందుకోవడం లేదు.
ఈ పరిస్థితుల్లో ఇటీవలే 'జైలర్' అనే మూవీతో వచ్చారు. దీనికి వరల్డ్ వైడ్‌గా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే 5వ రోజూ కలెక్షన్లు కుమ్మేసింది. మరి ఈ సినిమా టోటల్ కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!

జైలర్‌గా రజినీకాంత్ అరాచకం: సూపర్ స్టార్ రజినీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన సినిమానే 'జైలర్'. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేయగా.. తమన్నా హీరోయిన్‌గా నటించింది. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబు కీలక పాత్రలను పోషించారు.

జైలర్ మూవీకి బిజినెస్ ఇలా: 'జైలర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ అయింది.

5వ రోజు తెలుగులో వసూళ్లు: 'జైలర్' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 5వ రోజూ రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 1.72 కోట్లు, సీడెడ్‌లో రూ. 51 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 48 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 22 లక్షలు, కృష్ణాలో రూ. 23 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలతో.. రూ. 3.56 కోట్లు షేర్, రూ. 5.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

5 రోజులకు కలిపి ఎంతంటే: రజినీకాంత్'జైలర్' మూవీ ఏపీ, తెలంగాణలో 5 రోజుల్లో రచ్చ లేపేసింది. ఫలితంగా నైజాంలో రూ. 10.39 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.92 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.83 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.52 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 90 లక్షలు, గుంటూరులో రూ. 1.74 కోట్లు, కృష్ణాలో రూ. 1.49 కోట్లు, నెల్లూరులో రూ. 71 లక్షలతో.. రూ. 22.50 కోట్లు షేర్, రూ. 38.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

తెలుగులో ఎన్ని కోట్ల లాభం: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'జైలర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తద్వారా ఈ చిత్రం రూ. 13 కోట్లు మేర బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ మూవీ 5 రోజుల్లోనే రూ. 22.70 కోట్లు రాబట్టింది. ఫలితంగా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 9.50 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుని సత్తా చాటింది.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు: 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము లేపింది. దీంతో 5 రోజుల్లో తెలుగులో రూ. 39.70 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 96.85 కోట్లు, కర్నాటకలో రూ. 36.00 కోట్లు, కేరళలో రూ. 27.80 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 141.50 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 346.90 కోట్లు గ్రాస్, రూ. 170.25 కోట్లు షేర్ వచ్చింది.

ఓవరాల్‌గా లాభం ఎంతంటే: రజినీకాంత్ - నెల్సన్ కాంబినేషన్‌లో రూపొందిన 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 122.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇది రూ. 124 కోట్లు షేర్ టార్గెట్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చింది. ఇక, ఈ చిత్రం 5 రోజుల్లో రూ. 170.25 కోట్లు రాబట్టింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 46.25 కోట్లు మేర లాభాలను కూడా ఖాతాలో వేసుకుంది.


Click it and Unblock the Notifications











