Jailer 6 Days Collections: తలైవా దండయాత్ర.. 6 రోజుల్లోనే అన్ని వందల కోట్లా.. తెలుగులో సంచలన రికార్డు

దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తన రేంజ్‌ను పెంచుకుంటూనే వెళ్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. రిజల్ట్‌తో అస్సలు సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ఆయన.. చాలా కాలంగా హిట్‌కు దూరంగా ఉన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు 'జైలర్' అనే సినిమాతో వచ్చారు. దీనికి మాత్రం భారీ రెస్పాన్స్ వస్తుండడంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఇలా ఈ చిత్రం ఆరు రోజుల్లోనే వందల కోట్లు కలెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు 'జైలర్' మూవీ ఫుల్ రిపోర్టుపై మీరే లుక్కేయండి!

Rajinikanth Starrer Jailer Movie 6 Days Worldwide Official Collections

జైలర్‌గా రజినీకాంత్ ఎంటర్: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన సినిమానే 'జైలర్'. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేయగా.. తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఇందులో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబు కీలక పాత్రలను పోషించారు. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని ఇచ్చాడు.

Rajinikanth Starrer Jailer Movie 6 Days Worldwide Official Collections

జైలర్ మూవీకి బిజినెస్ ఇలా: 'జైలర్' మూవీపై మొదటి నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ జరిగింది.

Rajinikanth Starrer Jailer Movie 6 Days Worldwide Official Collections

6వ రోజు తెలుగులో వసూళ్లు: 'జైలర్' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6వ రోజు సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 2.88 కోట్లు, సీడెడ్‌లో రూ. 84 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 80 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 40 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, గుంటూరులో రూ. 38 లక్షలు, కృష్ణాలో రూ. 37 లక్షలు, నెల్లూరులో రూ. 20 లక్షలతో.. రూ. 6.10 కోట్లు షేర్, రూ. 10.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Rajinikanth Starrer Jailer Movie 6 Days Worldwide Official Collections

6 రోజులకు కలిపి ఎంతంటే: రజినీకాంత్'జైలర్' మూవీ ఏపీ, తెలంగాణలో 6 రోజుల్లో దుమ్ము దులిపింది. ఫలితంగా నైజాంలో రూ. 13.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.76 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.63 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.92 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.13 కోట్లు, గుంటూరులో రూ. 2.12 కోట్లు, కృష్ణాలో రూ. 1.86 కోట్లు, నెల్లూరులో రూ. 92 లక్షలతో.. రూ. 28.60 కోట్లు షేర్, రూ. 49.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

Rajinikanth Starrer Jailer Movie 6 Days Worldwide Official Collections

తెలుగులో ఎన్ని కోట్ల లాభం: క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'జైలర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తద్వారా ఈ చిత్రం రూ. 13 కోట్లు మేర బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ మూవీ 6 రోజుల్లోనే రూ. 28.60 కోట్లు రాబట్టింది. ఫలితంగా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 15.60 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుని సత్తా చాటింది.

Rajinikanth Starrer Jailer Movie 6 Days Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు: 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము లేపింది. దీంతో 6 రోజుల్లో తెలుగులో రూ. 50.00 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 115.35 కోట్లు, కర్నాటకలో రూ. 43.55 కోట్లు, కేరళలో రూ. 33.60 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 7.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 152.60 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 402.25 కోట్లు గ్రాస్‌, రూ. 197.35 కోట్లు షేర్ వచ్చింది.

Rajinikanth Starrer Jailer Movie 6 Days Worldwide Official Collections

ఓవరాల్‌గా లాభం ఎంతంటే: రజినీకాంత్ - నెల్సన్ కలయికలో తెరకెక్కిన 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 122.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇది రూ. 124 కోట్లు షేర్ టార్గెట్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చింది. ఇక, ఈ చిత్రం 6 రోజుల్లో రూ. 197.35 కోట్లు రాబట్టింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 73.35 కోట్లు మేర లాభాలను కూడా ఖాతాలో వేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X