Jailer 9 Days Collections: అన్ని వందల కోట్లు ఔట్.. తెలుగులో మరో రికార్డు.. ఇదేం కొట్టుడు సామీ!

తనదైన చిత్రాలతో దాదాపు నలభై ఏళ్లుగా సినీ ప్రియులను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. గతంలో కంటే ఈ మధ్య కాలంలో కమర్షియల్ చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తున్న ఆయన.. సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే రజినీకాంత్ 'జైలర్' అనే సినిమాను చేశారు.

ఈ మూవీకి ఆరంభం నుంచే అదిరిపోయే స్పందన వస్తోంది. ఇలా రెండో వారంలోనూ ఇది సత్తా చాటుతూ వెళ్తోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'జైలర్' మూవీ 9 రోజుల రిపోర్టును మీరే చూడండి!

Rajinikanth Starrer Jailer Movie 9 Days Worldwide Official Collections

కామెడీ, యాక్షన్‌తో వచ్చింది: రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన కామెడీ, యాక్షన్ మూవీనే 'జైలర్'. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేయగా.. తమన్నా హీరోయిన్‌గా నటించింది. దీనికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ చేశాడు. ఇందులో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు కీలక పాత్రల్లో కనిపించారు.

Rajinikanth Starrer Jailer Movie 9 Days Worldwide Official Collections

జైలర్ మూవీకి బిజినెస్ ఇలా: 'జైలర్' మూవీపై ఓ రేంజ్‌లో హైప్ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా హక్కులకు వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ అయింది.

Rajinikanth Starrer Jailer Movie 9 Days Worldwide Official Collections

9వ రోజు తెలుగులో వసూళ్లు: 'జైలర్' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 9వ రోజు సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 75 లక్షలు, సీడెడ్‌లో రూ. 23 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 22 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. రూ. 1.60 కోట్లు షేర్, రూ. 2.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Rajinikanth Starrer Jailer Movie 9 Days Worldwide Official Collections

9 రోజులకు కలిపి ఎంతంటే: 'జైలర్' 9 రోజుల్లో ఏపీ, తెలంగాణలో సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది. ఫలితంగా నైజాంలో రూ. 16.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.62 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.51 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.30 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.34 కోట్లు, గుంటూరులో రూ. 2.44 కోట్లు, కృష్ణాలో రూ. 2.14 కోట్లు, నెల్లూరులో రూ. 1.06 కోట్లతో.. రూ. 34.59 కోట్లు షేర్, రూ. 59.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

Rajinikanth Starrer Jailer Movie 9 Days Worldwide Official Collections

తెలుగులో ఎన్ని కోట్ల లాభం: క్రేజీ కాంబోలో వచ్చిన 'జైలర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తద్వారా ఈ చిత్రం రూ. 13 కోట్లు మేర బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ మూవీ 9 రోజుల్లోనే రూ. 34.59 కోట్లు రాబట్టింది. ఫలితంగా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 21.59 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుని సరికొత్త రికార్డును సాధించింది.

Rajinikanth Starrer Jailer Movie 9 Days Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు: 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. దీంతో 9 రోజుల్లో తెలుగులో రూ. 60.15 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 132.10 కోట్లు, కర్నాటకలో రూ. 50.15 కోట్లు, కేరళలో రూ. 39.15 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 158.80 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 449.75 కోట్లు గ్రాస్‌, రూ. 220.35 కోట్లు షేర్ వచ్చింది.

Rajinikanth Starrer Jailer Movie 9 Days Worldwide Official Collections

ఓవరాల్‌గా లాభం ఎంతంటే: ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 122.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇది రూ. 124 కోట్లు షేర్ టార్గెట్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చింది. ఇక, ఈ చిత్రం 9 రోజుల్లో రూ. 220.35 కోట్లు రాబట్టింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 96.35 కోట్లు లాభాలను అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X