Jailer Closing Collections: 124 కోట్లు సినిమా.. బాహుబలి రికార్డు బ్రేక్.. ఏకైక హీరోగా రజినీ సంచలనం
తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి ఎన్నో దేశాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ఏకైక హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. అంతలా ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్నారు. ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా ఫ్లాపుల తర్వాత ఆయన 'జైలర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రేజీ కాంబోలో రూపొందిన ఈ చిత్రం భారీ కలెక్షన్లతో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో 'జైలర్' మూవీ క్లోజింగ్ కలెక్షన్ల రిపోర్టును చూద్దాం పదండి!
జైలర్‌గా రజినీకాంత్ అరాచకం
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రమే 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వినాయకన్, వసంత్ రవి ప్రధాన పాత్రలను చేయగా.. తమన్నా, సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చాడు.

జైలర్ మూవీకి బిజినెస్ ఇలా
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'జైలర్' మూవీపై అంచనాలు ఏర్పడడంతో ఈ సినిమా హక్కులకు వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో భారీ డిమాండ్ వచ్చింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ అయింది.

అలాంటి టాక్.. భారీ వసూళ్లు
చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తోన్న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' చిత్రానికి ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే దీనికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన దక్కింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలో పోటెత్తాయి. ఇలా ఈ సినిమా వారంలోనే టార్గెట్‌ను చేరుకుంది. అప్పటి నుంచి భారీ లాభాలను అందుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే
'జైలర్' మూవీ ఫుల్ రన్‌లో ఏపీ, తెలంగాణలో భారీ స్పందన అందుకుంది. ఫలితంగా నైజాంలో రూ. 22.84 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.17 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.04 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.23 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.83 కోట్లు, గుంటూరులో రూ. 3.21 కోట్లు, కృష్ణాలో రూ. 2.86 కోట్లు, నెల్లూరులో రూ. 1.44 కోట్లతో.. రూ. 47.62 కోట్లు షేర్, రూ. 82.00 కోట్లు గ్రాస్ వచ్చింది.
తెలుగులో ఎన్ని కోట్ల లాభం
ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'జైలర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తద్వారా ఈ చిత్రం రూ. 13 కోట్లు మేర బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ మూవీ ఫుల్ రన్‌లో రూ. 47.62 కోట్లు రాబట్టింది. ఫలితంగా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 34.62 కోట్లు లాభాలను అందుకుని సరికొత్త రికార్డును నమోదు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా 'జైలర్' దుమ్ము దులిపింది. దీంతో ఫుల్ రన్‌లో తెలుగులో రూ. 83.10 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 189.30 కోట్లు, కర్నాటకలో రూ. 67.90 కోట్లు, కేరళలో రూ. 56.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 16.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 192.75 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 605.45 కోట్లు గ్రాస్, రూ. 295.40 కోట్లు షేర్ వచ్చింది.

ఓవరాల్‌గా లాభం ఎంతంటే
'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 122.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇది రూ. 124 కోట్లు షేర్ టార్గెట్‌తో వచ్చిన ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 295.40 కోట్లు రాబట్టింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 171.40 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది. అదే సమయంలో 'బాహుబలి 1' కలెక్షన్ల (605 కోట్లు)ను కూడా దాటేసింది.


Click it and Unblock the Notifications











