Jailer Collections: ప్రభాస్ రికార్డు బ్రేక్ చేసిన రజినీకాంత్.. రిలీజ్ డేకు ముందే అన్ని కోట్లా!
పేరుకు సీనియర్ హీరోనే అయినా.. కుర్రాళ్లకు ధీటుగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. అయితే, ఈ మధ్య కాలంలో పెద్ద విజయాన్ని మాత్రం ఆయన అందుకోలేకపోయారు. దీంతో ఈ సారి ఎలాగైనా గట్టి సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు రజినీకాంత్ 'జైలర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి నార్త్ అమెరికాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ చిత్రం ఓ రికార్డు నమోదు చేసింది. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!
'జైలర్'గా మారిన రజినీకాంత్:సూపర్ స్టార్ రజినీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన మూవీనే 'జైలర్'. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేయగా.. తమన్నా హీరోయిన్‌గా నటించింది. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబు తదితరులు కీలక పాత్రలు చేశారు.

భారీ రెస్పాన్స్... వసూళ్లు ఫుల్:సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' మూవీ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. దీంతో అన్ని చోట్లా పండుగ వాతావరణం నెలకొంది. తద్వారా ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఓవర్సీస్‌లో మరింత ఎక్కువ:మిగిలిన ఏరియాలతో పోల్చుకుంటే ఓవర్సీస్‌లో 'జైలర్' మూవీ సందడి మరింత ముందుగానే ప్రారంభం అయింది. అక్కడ ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ముందుగానే ఓపెన్ అయ్యాయి. దీనికితోడు సూపర్ స్టార్ అభిమానులు ఈ చిత్రం కోసం ముందు నుంచే ఆసక్తిని చూపించారు. దీంతో యూఎస్ సహా ఎన్నారైలు ఎక్కువున్న దేశాల్లో మరింతగా రెస్పాన్స్ వస్తోంది.

యూఎస్‌లో భారీ వసూళ్లతోనే:నెల్సన్ దిలీప్ కుమార్ ధర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' మూవీకి ఓవర్సీస్‌లో మంచి స్పందనే వస్తోంది. ముఖ్యంగా యూఎస్‌లో ఈ సినిమాకు 333 లొకేషన్లలో ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. అక్కడ ఈ సినిమా ఏకంగా 878K డాలర్లను వసూలు చేసి సత్తా చాటింది. అంటే భారత కరెన్సీలో రూ. 7.27 కోట్లు గ్రాస్‌ను ఈ సినిమా వసూలు చేసింది.

ఒక మిలియన్ మార్క్ కూడా:యూఎస్‌లో ప్రీమియర్స్‌కు ఏకంగా 878K డాలర్లను వసూలు చేసి సత్తా చాటిన 'జైలర్' మూవీ.. కెనెడాలోనూ అదిరిపోయే స్పందనను అందుకుంది. దీంతో అక్కడ ఈ చిత్రం ఏకంగా 170K డాలర్లు రాబట్టింది. ఇలా నార్త్ అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్స్ ద్వారానే 1.04 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే భారత కరెన్సీలో రూ. 8.61 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రభాస్ రికార్డు బ్రేక్ అయింది:రజినీకాంత్ 'జైలర్' మూవీ యూఎస్‌లో ప్రీమియర్ ద్వారానే 1.04 మిలియన్ డాలర్లను వసూలు చేసి అదిరిపోయే ఘనతను సొంతం చేసుకుంది. అదే సమయంలో ఈ ఏడాది విడుదలైన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' రికార్డును బ్రేక్ చేసింది. ప్రభాస్ నటించిన ఈ చిత్రం ప్రీమియర్స్ ద్వారా 825K డాలర్స్ గ్రాస్‌ను వసూలు చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











