Jailer USA Collections: చరిత్ర సృష్టించిన తలైవా.. పరాయి దేశంలో దండయాత్ర.. ఏకంగా అన్ని మిలియన్లా!
ఇండియా మొత్తంలోని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే చాలా దేశాల్లో ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నారు. అందులో సౌతిండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతోన్న ఆయన.. ఇప్పటికీ తన రేంజ్‌ను పెంచుకుంటూనే వెళ్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో 'జైలర్' అనే సినిమాను చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆరంభంలోనే అదిరిపోయే టాక్ వచ్చింది. దీంతో అప్పటి నుంచి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'జైలర్' మూవీ 11 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా ఈ మార్కును చేరిన అతి తక్కువ చిత్రాల సరసన చేరిపోయింది. ముఖ్యంగా ఈ మూవీ యూఎస్‌లో మరింత ఎక్కువ స్పందనను అందుకుంటూనే వెళ్తోంది. అక్కడి సినీ ప్రియులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో వసూళ్లు బాగా వస్తున్నాయి.
నెల్సన్ దిలీప్ కుమార్ ధర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' మూవీకి యూఎస్ ప్లస్ కెనెడాలో ప్రీమియర్ షోలకు 948K డాలర్లను వసూలు అయ్యాయి. అదే ఊపును కంటిన్యూ చేస్తూ ఈ చిత్రం 11 రోజుల్లోనే ఏకంగా 5 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. ఇలా ఈ చిత్రం ఒక్క యూఎస్‌లోనే రూ. 45 కోట్లు వరకూ గ్రాస్‌ను రాబట్టి రికార్డులు సాధించింది.
'జైలర్' మూవీ యూఎస్‌లో అదిరిపోయే కలెక్షన్లతో సత్తా చాటుతోంది. ఈ సినిమా తమిళ వెర్షన్‌కు అక్కడ 4.1 మిలియన్ డాలర్లు వసూలు అయ్యాయి. అలాగే, తెలుగు వెర్షన్‌కు 1.2 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఇలా ఈ చిత్రం 11 రోజుల్లోనే 5.3 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇక, మిలిగిన దేశాల్లో కూడా ఈ సినిమా అదిరిపోయే వసూళ్లతో దుమ్ముదులుపుతోంది.

ఇదిలా ఉండగా.. 'జైలర్' మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వినాయకన్, వసంత్ రవి ప్రధాన పాత్రలను చేశారు. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు కీలక పాత్రలు చేశారు. తమన్నా, శివరాజ్‌కుమార్, మోహన్ లాల్ అతిథి పాత్రల్లో మెరిశారు.


Click it and Unblock the Notifications











