Jailer Day 1 Collections: జైలర్ పెను సంచలనం.. నెంబర్ వన్ మూవీగా రికార్డు.. తెలుగు వసూళ్లు చూశారంటే!
విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలు, ప్రత్యేకమైన స్టైల్స్‌తో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగానే సినీ రంగంలో తనదైన రీతిలో సందడి చేస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఈ మధ్య కాలంలో ఏజ్‌కు తగ్గ సినిమాలు చేస్తూ మెప్పిస్తోన్న ఆయన.. విజయాలను మాత్రం పెద్దగా అందుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 'జైలర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో 'జైలర్' మూవీ మొదటి రోజు వసూళ్లపై మీరే లుక్కేయండి!
జైలర్‌గా వచ్చిన రజినీకాంత్:సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన చిత్రమే 'జైలర్'. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేయగా.. తమన్నా హీరోయిన్‌గా నటించింది. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

జైలర్ మూవీకి బిజినెస్ ఇలా:'జైలర్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో రూ. 122.50 కోట్లు బిజినెస్ చేసింది.
అలాంటి టాక్.. భారీ రెస్పాన్స్:ఎన్నో అంచనాల నడుమ విడుదలైన రజినీకాంత్ 'జైలర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే అంతగా రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేన అత్యధిక కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు తగ్గట్లే ఫస్ట్ డేనే భారీ స్థాయిలో వసూళ్లు దక్కాయి.

తొలి రోజు తెలుగులో వసూళ్లు:'జైలర్' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి రోజు సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 3.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 94 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 81 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 40 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, గుంటూరులో రూ. 65 లక్షలు, కృష్ణాలో రూ. 45 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో.. రూ. 7.01 కోట్లు షేర్, రూ. 12.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు:'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. దీంతో మొదటి రోజు తెలుగులో రూ. 12.50 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 22.85 కోట్లు, కర్నాటకలో రూ. 11.80 కోట్లు, కేరళలో రూ. 5.85 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35.10 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 91.20 కోట్లు గ్రాస్, రూ. 44.75 కోట్లు షేర్ వచ్చింది.

ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?:'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 122.50 కోట్ల బిజినెస్ చేసుకుని రూ. 124 కోట్లు షేర్ టార్గెట్‌తో వచ్చింది. ఇది ఫస్ట్ డే రూ. 44.75 కోట్లు రాబట్టింది. అంటే.. ఇంకా 79.45 కోట్లు వసూలు చేయాలి. అలాగే, తెలుగులో రూ. 12 కోట్లు బిజినెస్.. రూ. 13 కోట్లు టార్గెట్‌తో వచ్చింది. ఫస్ట్ డే ఇది రూ. 7.01 కోట్లు రాబట్టడంతో ఇంకా రూ. 5.99 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











