twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Annaatthe Telugu Rights: రజనీకాంత్ మార్కెట్ మరీ ఇంత తక్కువా.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే?

    |

    తమిళ చిత్ర పరిశ్రమలో గతంలో ఎప్పుడూ లేని విధంగా సీనియర్ హీరోలు బాక్సాఫీస్ రేంజ్ మెల్లగా తగ్గుతూ వస్తోంది. ఇటీవల కమల్ హాసన్ సినిమాలకు పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా మార్కెట్ వాల్యూ అయితే చాలా వరకు తగ్గుతుంది. ఒకప్పుడు తెలుగులో కూడా రజనీకాంత్ కు ఇక్కడి హీరోలతో సమానంగా మార్కెట్ ఉండేది. అయితే కాలక్రమేణా ఆయన సినిమాలు మరీ కమర్షియల్ కావడం వలన అభిమానులు ఎక్కువగా పట్టించుకోవడం లేదు అనే టాక్ వస్తోంది. తెలుగులోనే కాకుండా తమిళం లో కూడా ఆయనకు ఇటీవల కాలంలో పెద్దగా విజయాలు దక్కలేదు. ఇక ఇప్పుడు అన్నత్తై సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలనే చూస్తున్నాడు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులు కూడా అమ్ముడయ్యాయి.

    తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్

    తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్

    సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళం లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సెట్ చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే తెలుగులో కూడా తన కంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకుంటూ వస్తున్నాడు. రజినీకాంత్ కు తెలుగువారు అంటే కూడా చాలా ఇష్టం. ఇక్కడ ఆయనకు చాలా మంది సినీ ప్రముఖులు కూడా స్నేహితులుగా ఉన్నారు. ఇక ఆ మధ్య కాలంలో డైరెక్ట్ గా కొన్ని తెలుగు సినిమాలు కూడా చేశారు. ఇక ఇప్పుడు అన్ని సినిమాలు తెలుగులో భారీగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

    వరుసగా అపజయాలు

    వరుసగా అపజయాలు

    సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుని చాలా కాలం అవుతోంది. ముఖ్యంగా రోబో సినిమా తర్వాత ఆయనకు సరైన విజయం దక్కలేదనే చెప్పాలి. కబాలి భారీగా ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత కాలా, 2.0 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి అంతేకాకుండా మురుగదాస్ దర్శకత్వంలో చేసిన దర్బార్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పెద్దగా అందుకోలేకపోయింది.

     తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని..

    తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని..

    రజినీకాంత్ మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ఎంతగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ కలెక్షన్స్ అయితే మెల్లమెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నత్తై అనే మాస్ కమర్షియల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఒకేసారి తమిళ తెలుగులో విడుదల చేయాలని చూస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలకు కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది. అన్నత్తై టైటిల్ సాంగ్ ఎస్పీ. బాలసుబ్రమణ్యం చివరి పాట కావడంతో ఇటీవల ఆ పాటకు భారీగా రెస్పాన్స్ వచ్చింది.

    Recommended Video

    Bigg Boss Telugu 5 : అక్కా తొక్కా అని పిలవకండి.. రెచ్చిపోయిన ఆనీ మాస్టర్..! || Filmibeat Telugu
    బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే..

    బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే..

    ఇక తెలుగులో ఈ సినిమాను డబ్ చేసేందుకు అగ్ర నిర్మాతలు ఎవరు కూడా మొదట్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక ఇటీవల ఒక ప్రొడ్యూసర్ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ హక్కులు 12 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. అంటే సినిమా హిట్టవ్వాలి అంటే తెలుగులో 12.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. రజినీకాంత్ చివరిగా చేసిన సినిమాలలో దర్బార్ కేవలం 10 కోట్ల వరకు మాత్రమే షేర్ రాబట్టింది. మరి ఇప్పుడు అన్నత్తై సినిమా ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

    English summary
    rajinikanth upcoming movie Annaatthe Telugu Rights,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X