Jailer: జపాన్‌లో జైలర్ జైత్రయాత్ర.. RRR మూవీ కలెక్షన్లపై కన్నేసిన రజనీ!

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, రమ్యకృష్ణ, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, శివ రాజ్‌కుమార్, మోహన్ లాల్, సునీల్, యోగిబాబు నటించిన తాజా చిత్రం జైలర్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. అయితే ఈ సినిమా జపాన్‌లో రిలీజై జైత్రయాత్రను మొదలుపెట్టింది. జపాన్ రిలీజ్ గురించిన వివరాల్లోకి వెళితే..

జైలర్ సినిమాలో అగ్ర నటులు భారీగా ఉండటంతో బడ్జెట్ భారీగానే పెరిగిపోయింది. గతంలో రజనీకాంత్ నటించిన సినిమాల కంటే ఎక్కువ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కించారు. రజనీకాంత్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ రెమ్యునరేషన్లతో కలిపి మొత్తంగా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

Rajinikanth s Jailer great start at Japan Box Office

జైలర్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తమిళనాడులో 196 కోట్ల రూపాయల గ్రాస్, నైజాం, ఆంధ్రాలో 80 కోట్లు, కర్ణాటకలో 70 కోట్లు, కేరళలో 57 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 200 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ చిత్రం ఇండియాలో345 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

జపాన్‌లో రజనీకాంత్‌కు ఊహించని క్రేజ్ ఉంది. 1995 సంవత్సరంలో ముత్తు రిలీజై ప్రభంజనం కొనసాగించింది. ముత్తు సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పటి నుంచి రజనీకి విశేషమైన అభిమానగణం ఏర్పాటైంది. రజనీకాంత్ సినిమా రిలీజైందంటే.. ఆ సినిమాను అక్కున చేర్చుకొంటారనే విషయం పలు సందర్భాల్లో రుజువైంది.

Rajinikanth s Jailer great start at Japan Box Office

దేశంలో సంచలన విజయం సాధించిన జైలర్ చిత్రం ఫిబ్రవరి 21వ తేదీన జపాన్‌లో రిలీజైంది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే థియేటర్లకు రజనీ ఫాన్స్ పోటేత్తారు. థియేటర్లన్నీ హౌస్‌పుల్స్‌తో కొనసాగుతున్నాయి. గత నాలుగు రోజుల్లో భారీగా కలెక్షన్లు నమోదైనట్టు సమాచారం. జపాన్ కలెక్షన్ల వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

జపాన్‌లో ఇటీవల అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా RRR రికార్డు సాధించింది. ఈ సినిమా ఆ దేశంలో సుమారుగా 121 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా జైత్రయాత్ కొనసాగించి RRR రికార్డును అధిగమిస్తుందా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. జపాన్‌లో జైలర్ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: rajinikanth jailer japan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X