Jailer Collections రజనీ బాక్సాఫీస్ రచ్చ.. 1500000 పైగా టిక్కెట్ల అమ్మకం.. జైలర్‌కు ఎన్ని కోట్లంటే?

సూపర్‌స్టార్ రజనీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన జైలర్ మూవీ భారీగా కలెక్షన్లు సాధించే అవకాశం కనిపిస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ రెస్పాన్స్ కనిపిస్తున్నది. కేవలం తమిళనాడులోనే కాకుండా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పొన్నియన్ సెల్వన్ సినిమా రికార్డులను అధిగమించే దిశలో ప్రయాణం సాగిస్తున్నది. తొలి రోజు బాక్సాఫీస్ రిపోర్టు వివరాల్లోకి వెళితే..

తమిళనాడులో హాట్ కేకుల్లా :తమిళనాడులో రజనీకాంత్ మ్యాజిక్ జైలర్ రూపంలో కనిపిస్తున్నది. ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం తమిళనాడులో సుమారు 700000 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. తమిళనాడులో ఈ చిత్రం ఓపెనింగ్ డే రోజున సుమారు 27 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్ నమోదైందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Rajinikanths Jailer Movie day 1 prediction of Advance Booking collections worldwide

కర్ణాటకలో కేజీఎఫ్ తర్వాత :ఇక జైలర్ సినిమా కర్ణాటకలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డుల క్రియేట్ చేసింది. కేజీఎఫ్ తర్వాత ఆ రేంజ్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేయబోతున్నది. ఇప్పటి వరకు కర్ణాటకలో 250000 టికెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం. కేరళలో కూడా ఈ క్రేజ్ కనిపిస్తున్నది. కేరళలో ఇప్పటి వరకు ప్రస్తుతానికి 1.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.

నైజాం, ఏపీలో వసూళ్లు:ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా జైలర్ హవా కొనసాగుతున్నది. హైదరాబాద్‌లోనే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సుమారు 2.5 కోట్ల కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.

Rajinikanths Jailer Movie day 1 prediction of Advance Booking collections worldwide

ఓవర్సీస్‌లో కలెక్షన్లు :జైలర్ చిత్రం ఓవర్సీస్‌లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేస్తున్నది. అమెరికా, కెనడా, యూకే, మలేషియా, శ్రీలంక, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాల్లో భారీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం కనిపిస్తున్నది. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా బాక్సాఫీస్ రిపోర్టు విదేశాల నుంచి వస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Rajinikanths Jailer Movie day 1 prediction of Advance Booking collections worldwide

అమెరికా, కెనడా, యూకేలో :ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. అమెరికాలో 5.5 కోట్ల గ్రాస్, కెనడాలో 1.30 కోట్ల గ్రాస్, యూకేలో 1.25 కోట్ల గ్రాస్, మలేషియాలో 1 కోటి రూపాయల గ్రాస్, శ్రీలంకలో 1 కోటి గ్రాస్ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు చేసింది. ఇంకా ఈ కలెక్షన్లు పరిగే అవకాశం ఉంది.

Rajinikanths Jailer Movie day 1 prediction of Advance Booking collections worldwide

తొలి రోజున అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు:జైలర్ ఓవరాల్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 20 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం ఓవరాల్‌గా తొలి రోజు 80 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందనే విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X