Lal Salaam Box Office రజనీ 50 ఏళ్ల కెరీర్‌లోనే అత్యంత దారుణంగా.. లాల్ సలామ్‌కు ఎన్ని కోట్ల నష్టమంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ తన 50 ఏళ్లకుపైగా కెరీర్‌లో ఊహించని ఫలితాన్ని చూడాల్సి వచ్చింది. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం లాల్ సలామ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టలేక చతికిలపడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని సుభాస్కరన్ నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో దారుణమైన ఫలితాన్ని చవిచూస్తున్నది. ఈ సినిమా 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
జైలర్ తర్వాత రజనీకాంత్ నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు పెట్టుకొన్నారు. అయితే ఈ సినిమా ఏ స్థాయిలోను ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో ఈ సినిమాపై విమర్శకులు, ప్రేక్షకులు పెదవి విరిచారు. దాంతో ఈ మూవీ పేలవమైన కలెక్షన్లను రాబడుతున్నది.

ఓవర్సీస్‌లో లాల్ సలామ్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అమెరికా, కెనడాలో కలిపి ఈ మూవీ 200K డాలర్లు అంటే 1.7 కోట్ల రూపాయలను, ఆస్ట్రేలియాలో 100K డాలర్లు అంటే 50 లక్షలు, న్యూజిలాండ్‌లో 12 వేల డాలర్లు అంటే 6 లక్షల రూపాయలు, యూకే, ఐర్లాండ్‌లో 60 వేల పౌండ్ల అంటే సుమారుగా 65 లక్షల రూపాయలు, గల్ఫ్‌లో 170 డాలర్లు అంటే 1.5 కోట్ల రూపాయలు, మలేషియా, సింగపూర్, యూరోపియన్ యూనియన్, ఇతర దేశాల్లో కలిపి 400K డాలర్లు అంటే 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు ఈ సినిమా సుమారుగా 7 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.
ఇక తమిళంలో ఈ సినిమా తొలి రోజు 3.5 కోట్లు, 2వ రోజు 3 కోట్ల రూపాయలు, 3వ రోజు 3 కోట్ల రూపాయలు, 4వ రోజు 1 కోటి రూపాయలు, 5వ రోజు 1 కోటి రూపాయలు వసూలు చేసింది. తమిళంలో గత 5 రోజుల్లో 11 కోట్ల రూపాయల మేర వసూలు చేసింది. గత 50 ఏళ్లలో ఇంత తక్కువ కలెక్షన్లను రజనీ తన కెరీర్‌లో రాబట్టలేదు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఏపీ, నైజాంలో కలిపి 1వ రోజు 30 లక్షలు, 2వ రోజు 30 లక్షలు, 3వ రోజు 30 లక్షలు, 4వ రోజు 25 లక్షలు, 5వ రోజు 25 లక్షలు వసూలు చేసింది. గత 5 రోజుల్లో 1.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
లాల్ సలామ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఓవర్సీస్‌లో 7 కోట్ల రూపాయలు, తమిళంలో 11 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 1.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 19 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 50 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











