Vettaiyan Day1 Collections: వేట్టయన్ రికార్డు కలెక్షన్స్.. రజినీ మూవీకి ఎన్ని కోట్లంటే?
Vettaiyan Day 1 expected collections: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) వేట్టయన్ (Vettaiyan) గురువారం(అక్టోబర్ 10 న) భారీ అంచనాలతో మధ్య వరల్డ్ వైడ్ గా థియేటర్ లో రిలీజైంది. జై భీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ కాప్ డ్రామాలో రజనీకాంత్ హీరోలో నటించగా.. బాలీవుడ్ బీ బిగ్ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్, రోహిణి, రావు రమేష్, అభిరామి, రమేష్ తిలక్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. కాగా, పాన్ ఇండియా లెవల్ లో విడుదల ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకపోతుంది. ఈ తరుణంలో వెట్టయన్ తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఓ లూక్కేయండి.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 170వ సినిమా వేట్టయన్ ది హంటర్ (Vettaiyan Movie). ఈ మూవీ దసరా కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. రజనీకాంత్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఎపిక్ బ్లాక్ బస్టర్ జైలర్(Jailer)మూవీ తో పోల్చితే.. ఈ సినిమాకు ఉన్న బజ్.. ఈ మూవీకి లేక పోయినా కూడా ఫస్ట్ తోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది వెట్టయన్.

టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెట్టయన్ మూవీలో దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత రజనీకాంత్ తో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందించారు. అలాగే.. వేట్టయన్ మూవీ విడుదలకు ముందే.. రిలీజైన టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాలను పెంచేశాయి. ఇలా ప్రతి అంశం ఈ మూవీ కలెక్షన్లను పెంచడానికి కారణమవుతున్నాయి.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించిన ఈ మూవీ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను రూ. 73 కోట్లకు రెడ్ జెయింట్ సంస్థ సొంతం చేసుకుంది. ఓవర్సీస్‌లోనూ లైకా ప్రొడక్షన్స్ రూ.45 కోట్లకు చేసుకుంది. ఇక కేరళలో శ్రీ గోకులం మూవీస్ వెట్టయాన్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నాయి. ఇక తెలుగు రాష్టాల విషయానికి వస్తే.. వెట్టయాన్ థియేట్రికల్ రైట్స్ రూ.17 కోట్లకు అమ్ముడు పోయాయి. కన్నడ, మలయాళం, హిందీ రైట్స్ రూ.25 కోట్లకు అమ్ముడు పోగా.. వరల్డ్ వైడ్ గా 160 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్నట్లు టాక్. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ పర్వాలేదు అనిపించేలా సాగుతూ ఉంది.

వెట్టయన్ ఫస్ట్ డే కలెక్షన్ అంచనా ..
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 2 కోట్ల లోపే బుకింగ్స్ ను అందుకోగా..రిలీజ్ అయినా తరువాత పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో కలెక్షన్లు జోరు అందుకున్నాయి. దీంతో దాదాపు రూ. 3 కోట్ల కలెక్షన్లు అందుకున్నట్టు సమాచారం. ఇక తమిళనాడులో ఆల్ మోస్ట్ 10 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ ను అందుకున్న ఈ మూవీ పాజిటివ్ టాక్ తో 20 -22 కోట్లు ఓపెనింగ్స్ కలెక్షన్లు అందుకున్నట్టు టాక్. ఇక కేరళలో 3 కోట్ల కలెక్షన్లు అందుకోగా... కర్ణాటకలో 8 కోట్ల ఓపెనింగ్స్ కలెక్షన్లు అందుకున్నట్టు సమాచారం.
ఓవర్సీస్ లో దూసుకుపోతుంది. కేవలం 16 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ ను అందుకున్న వెట్టయన్ మూవీ తొలిరోజు టాక్ బాగుంటే 25 -26 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకున్నట్టు సమాచారం. మొదటి రోజు వెట్టయన్ సినిమా వరల్డ్ వైడ్ గా 62-65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్నట్టు టాక్. ఆడియన్స్ నుండి రెస్పాన్స్ యునానిమస్ గా ఉంటే.. ఈ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఈ టాక్ ఇలానే కొనసాగుతే.. 65-70 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది,


Click it and Unblock the Notifications











