Lal Salaam 4 Days Collections రజనీకాంత్ కెరీర్‌లో అత్యంత డిజాస్టర్‌గా... నష్టాల నుంచి బయటపడాలంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ చిత్రం డిజాస్టర్ దిశగా అడుగులేస్తున్నది. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నది. దాంతో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవమైన కలెక్షన్లను రాబడుతున్నది. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై సుభాస్కరన్ రూపొందించిన ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
క్రికెట్, రూరల్ పాలిటిక్స్, రెండు మతాల మధ్య విద్వేషాలు అంశాలను కలగలిపి రూపొందిన లాల్ సినిమా చిత్రాన్ని సుమారుగా 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు కూడా పెద్దగా బజ్ లేకపోవడం వల్ల ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్లను రాబడుతున్నది.

రజనీకాంత్ కెరీర్‌లోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా లాల్ సలామ్ చిత్రం అతి తక్కువ ఓపెన్సింగ్స్‌ను సాధించింది. ఈ సినిమా తొలి రోజు ఇండియాలో 3.5 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. రెండో రోజు ఈ చిత్రం 3.25 కోట్లు, 3వ రోజు 3.15 కోట్ల రూపాయలతో స్టడీగా కనిపించింది.
తెలుగు రాష్ట్రాల్లో లాల్ సలామ్ చిత్రం పేలవమైన వసూళ్లను నమోదు చేస్తున్నద. మొదటి రోజు 30 లక్షలు, రెండో రోజు 25 లక్షలు, మూడో రోజు 25 లక్షల వసూళ్లు సాధించింది. దాంతో తొలి వారాంతంలో కేవలం 80 లక్షల రూపాయల నికర వసూళ్లు సాధించింది. అయితే ఇతర చిత్రాల పోటీతో నాసిరకంగా వసూళ్లను సాధిస్తున్నది.

ఇక లాల్ సలామ్ సినిమా 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. దారుణంగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఇండియా వైడ్‌గా 1.25 కోట్ల నికరంగా వసూళ్లను సాధించింది. తమిళంలో 1 కోటి రూపాయలు, తెలుగులో 25 లక్షల రూపాయల నిరకంగా వసూళ్లను సాధించింది. సుమారుగా 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, లాల్ సలామ్ చిత్రం ముందు భారీ బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 50 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం అసాధ్యంగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











