పేట కలెక్షన్లు.. తొలిరోజే తడాఖా చూపించిన రజనీ.. రికార్డు వసూళ్లు
రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన పేట సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్వకత్వంలో రజనీకాంత్, సిమ్రాన్, త్రిష, నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం జనవరి 10న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తొలిఆట నుంచే భారీ కలెక్షన్లు వస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

యూఎస్‌లో వసూళ్లు
పేట చిత్రం ప్రీమియర్ల ప్రదర్శనలను అమెరికాలో జనవరి 9న ప్రదర్శించబడ్డాయి. ప్రీమియర్లకు ప్రేక్షకులు పొటేత్తడంతో భారీగా వసూళ్లు నమోదయ్యాయి. ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్ షోల ద్వారా 5 లక్షల డాలర్లను కలెక్ట్ చేసింది.

భారీ అంచనాలతో
పేట సినిమాకు ముందు వచ్చిన 2.0 చిత్రం భారీ కలెక్షన్లను సాధించింది. మొదటిరోజు హిందీ వెర్షన్ వసూళ్లే రూ.20 కోట్లకుపైగా నమోదయ్యాయి. చెన్నైలో కాలా చిత్రం రికార్డు స్థాయిలో మొదటిరోజు రూ.1.76 కోట్లు వసూలు చేసింది. ఇలాంటి రికార్డులను పేట తుడిచిపెట్టడం ఖాయమనే మాట వినిపిస్తున్నది.

తమిళనాడులో భారీ ఎత్తున రిలీజ్
తమిళనాడులో భారీ ఎత్తున పేట సినిమా రిలీజైంది. ఈ చిత్రాన్ని తమిళనాడులో సుమారు 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. రిలీజైన ప్రతీచోట బ్రహ్మండమైన ఆదరణ లభిస్తున్నట్టు తాజా సమాచారం. తమిళనాడులో రికార్డుస్థాయి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రభావం
తెలుగు రాష్ట్రాల్లో పేట సినిమా ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో థియేటర్ల కొరత ఏర్పడింది. ఈ వారంలో ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ కాగా, 11న వినయ విధేయ రామ, ఎఫ్2 చిత్రాలు రిలీజ్ కానున్నాయి. దాంతో పేట చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయడానికి వీలు కలుగలేదు. ఆ కారణంగా వసూళ్లు నామమాత్రంగానే ఉండే అవకాశం ఉంది.

పేటాపై మిక్స్‌డ్ రియాక్షన్
రజనీకాంత్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి లాంటి దిగ్గజాలు నటించిన ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. సినీ ప్రేక్షకులను, విమర్శకులను పూర్తిస్థాయిలో పేట మెప్పించలేదనే మాట కూడా వినిపిస్తున్నది. దిగువ తరగతి ప్రేక్షకులకు రీచ్ అయితే భారీ విజయాన్ని నమోదు చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











