Annaatthe Closing Collections: రజనీకాంత్ మూవీ ఆ రెండు చోట్ల డిజాస్టర్.. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఎంతంటే?
దీపావళీ కానుకగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన అన్నాతే చిత్రం బాక్సాఫీస్ మెరుపులు మెరిపించింది. నయనతార, కీర్తీ సురేష్ నటించిన ఈ చిత్రం తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో రిలీజైంది. అయితే తొలి వారాంతంలో రికార్డుల దుమ్ము దులిపిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదే ఊపును కొనసాగించలేకపోయింది. తమిళనాడులో వర్షాలు కుంభవృష్టిగా కురవడంతో వసూళ్లపై దెబ్బ పడింది. అయితే అన్నాతే బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు కలెక్షన్లను సాధించిందంటే...

తమిళనాడులో రికార్డులు తిరగరాస్తూ
తమిళనాడులో అన్నాతే చిత్రం భారీ వసూళ్లను రాబట్టమే కాకుండా లాక్‌డౌన్ తర్వాత రిలీజైన చిత్రాల్లో రికార్డులను తిరగరాసింది. తమిళనాడులో తొలివారమే ఈ చిత్రం రూ.125 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక బాక్సాఫీస్ వద్ద పరుగు ముగించే సమయానికి ఈ చిత్రం రూ. తమిళనాడులో 90 కోట్ల రూపాయలకు పైగానే నికర వసూళ్లను సాధించింది.

సౌత్, నార్త్‌లో డిజాస్టర్‌గా
దక్షిణాదితోపాటు ఉత్తరాదిలో అన్నాతే చిత్రం డిజాస్టర్ ఫలితాన్ని అందుకొన్నది. కేరళలో ఈ చిత్రం 3 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్లు వసూలు చేసి దారుణమైన ఫలితాన్ని అందుకొన్నది. తెలుగు హక్కుల కోసం ఈ చిత్రానికి సుమారు 12 కోట్లు చెల్లించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో కనీసం 5 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తున్నది.

కర్ణాటకలో మెరుగైన వసూళ్లు
ఇక కర్ణాటకలో ఈ చిత్రం మోస్తారు కలెక్షన్లతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. కర్ణాటకలో ఈ చిత్రం రూ.10 కోట్లు వసూలు చేసి యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఇక మిగితా రాష్ట్రాల్లో ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకొన్న ఈ చిత్రం 2 కోట్ల రూపాయలను రాబట్టింది.

ఓవర్సీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు
ఇక ఓవర్సీస్‌లో అన్నాతే చిత్రం దుమ్ముదులిపేసింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల పరంపరను కొనసాగించింది. లాక్‌డౌన్ తర్వాత విడుదలైన భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా అరుదైన రికార్డును స్థాపించింది. అమెరికాతోపాటు ఓవర్సీస్‌లో కలిపి సుమారు 50 కోట్లు రాబట్టింది. దీంతో మెరుగైన వసూళ్లను నమోదుచేసింది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఇలా. .
తెలుగు, కేరళ, మిగితా రాష్ట్రాల్లో ప్రభావం చూపలేకపోయిన అన్నాతే చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం తమిళనాడులోనే 150 కోట్లు వసూలు చేసింది.దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం స్వల్ప నష్టాలతో ముగిసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే రిలీజ్‌కు ముందు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

నెట్‌ఫ్లిక్స్, సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్
థియేటర్లలో బాక్సాఫీస్ రన్ ముగించుకొన్న అన్నాతే చిత్రం త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. నెట్‌ఫ్లిక్స్, సన్ నెక్ట్స్ ఫ్లాట్‌ఫాంలపై ఈ చిత్రం రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్‌లో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రసారమవుతున్నది.


Click it and Unblock the Notifications











