Don't Miss!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాజు గారి గది 3: రెండో రోజు కలెక్షన్లు.. నష్టాల నుంచి బయటపడాలంటే
సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన రాజు గారి గది 3 చిత్రం మిశ్రమ స్పందనతో ముందుకెళ్తున్నది. బాక్సాఫీస్ వద్ద వారాంతపు ప్రేక్షకుల తాకిడితో మోస్తారు వసూళ్లను సాధించింది. యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన రాజు గారి గది సీక్వెల్స్‌లో ఇది మూడోది. అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంబంధించిన గత రెండు రోజులు ఫలితాలు ఇలా ఉన్నాయి.
రెండో రోజు కలెక్షన్లు
తొలి రోజున మంచి క్రేజ్‌తో ఓపెనింగ్స్ సాధించిన రాజు గారి గది రెండో రోజున కూడా అదే విధంగా వసూళ్లను రాబట్టింది. రెండో రోజున నైజాంలో రూ.42 లక్షలు, సీడెడ్‌లో రూ.18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.14 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.7.4 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.5.8 లక్షలు, గుంటూరులో రూ.6.3 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.7.2 లక్షలు, నెల్లూరులో రూ.3.5 లక్షల గ్రాస్ వసూళ్లను సాధించింది.
వరల్డ్ వైడ్ కలెక్షన్లు
ఇక ఏపీ, నైజాంలో మొత్తంగా చూసుకొంటే గత రెండు రోజుల్లో రూ.2.37 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కాగా ఓవర్సీస్లో సినిమాకు అంతగా స్పందన కనిపించడం లేదు. కర్ణాటకలో, ఇతర రాష్ట్రాల్లో రూ.19 లక్షలు, ఓవర్సీస్లో రూ.14 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా 2.70 కోట్ల షేర్, రూ.4.65 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
2 రోజుల మొత్తం కలెక్షన్లు
రాజుగారి గది 2 గత రెండు రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో ఈ చిత్రం రూ.88 లక్షలు, సీడెడ్‌లో రూ.46లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.30 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ. 17 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ.20.3 లక్షలు, కృష్ణా జిల్లాలోరూ.16 లక్షలు, నెల్లూరులో 7.5 లక్షలు వసూలు చేసింది.
లాభాల్లోకి రావాలంటే
రాజు గారి గది 3 ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం, ఏపీలో కలిపి రూ.4.5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్లో మొత్తంగా రూ.70 కోట్ల వసూళ్లు రాబట్టింది. మొత్తంగా రూ.5.2 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.6 కోట్ల షేర్‌ను సాధించాల్సింది. అంటే ఈ చిత్రం ఇంకా రూ.3.5 కోట్లు వసూలు చేయగలిగితే డిస్టిబ్యూటర్లు నష్టాల నుంచి బయటపడుతారని ట్రేడ్ వర్గాల రిపోర్టు.