నాగార్జున, సమంతకు షాక్.. మూడు రోజులకే సంతోషం ఆవిరి..

టెలివిజన్ యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న రాజుగారి గది2 చిత్రానికి వచ్చిన స్పందన చూసి నాగార్జున, సమంత అక్కినేని మురిసిపోయారు. వారాంతంలో నమోదైన కలెక్షన్ల చూసి ఆనందంలో మునిగిపోయారు. కానీ ఆ సంత

By Rajababu

టెలివిజన్ యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న రాజుగారి గది2 చిత్రానికి వచ్చిన స్పందన చూసి నాగార్జున, సమంత అక్కినేని మురిసిపోయారు. వారాంతంలో నమోదైన కలెక్షన్ల చూసి ఆనందంలో మునిగిపోయారు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉన్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే..

సమంత సంతోషానికి హద్దులు

సమంత సంతోషానికి హద్దులు

నాగచైతన్యతో పెళ్లి తర్వాత వచ్చిన సినిమాకు మంచి స్పందన రావడంతో సమంత సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. రాజుగారి గది2 చిత్ర సక్సెస్ చైతూతో జరిగిన పెళ్లికి ప్రేక్షకులు ఇచ్చిన కానుక అని పొంగిపోయింది. వారాంతానికి పరిస్థితి బాగానే ఉంది.

Recommended Video

దుమ్ము రేపుతున్న రాజుగారి గది కలెక్షన్లు..
రాజు గారిగది2 కలెక్షన్లు

రాజు గారిగది2 కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో రాజుగారి గది2 చిత్రం సుమారు 9.58 కోట్లు కొల్లగొట్టింది. నాగార్జున కెరీర్‌లో ఈ రేంజ్ కలెక్షన్లు రావడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. అయితే సోమవారం తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో రాజుగారి గది2 చిత్రం సుమారు 9.58 కోట్లు కొల్లగొట్టింది. నాగార్జున కెరీర్‌లో ఈ రేంజ్ కలెక్షన్లు రావడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. అయితే సోమవారం నుంచి రాజు గారిగది2 కలెక్షన్లు షాక్ గురిచేస్తున్నాయట. సాధారణంగా తొలివారంలో సోమవారం కూడా హిట్ చిత్రానికి, భారీ సినిమాకు అదే రేంజ్‌లో ఉంటాయి.
నుంచి రాజు గారిగది2 కలెక్షన్లు షాక్ గురిచేస్తున్నాయట. సాధారణంగా తొలివారంలో
సోమవారం కూడా హిట్ చిత్రానికి, భారీ సినిమాకు అదే రేంజ్‌లో ఉంటాయి.

భారీగా క్షీణించిన కలెక్షన్లు

భారీగా క్షీణించిన కలెక్షన్లు

వారాంతం వరకు భారీగా కలెక్షన్లు వచ్చిన తర్వాత సోమవారం వచ్చే కలెక్షన్లు క్షీణించడం సాధారణమైనవే. కానీ ఈ చిత్రం కలెక్షన్లు భారీగా పడిపోవడం అంతుపట్టని విషయంగా మారిందని చెప్పుకొంటున్నారు.

అక్టోబర్ 18న రవితేజ

అక్టోబర్ 18న రవితేజ

వారం ప్రారంభంలోనే కలెక్షన్ల పరిస్థితి ఉంటే.. అక్టోబర్ 18న రవితేజ నటించిన రాజా ది గ్రేట్, అక్టోబర్ 19న తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన మెర్సల్ (అదిరింది) చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ పెద్ద సినిమాల ఊపుకు రాజుగారి గది తట్టుకొంటుందా అనేది ఓ ప్రశ్నగా మారింది.

మరోసారి లాంగ్ వీకెండ్

మరోసారి లాంగ్ వీకెండ్

దీపావళి పండు నేపథ్యంలో మరోసారి ఈ ఏడాది లాంగ్ వీకెండ్ కనిపిస్తున్నది. బుధవారం నుంచి సోమవారం వరకు హాలీడేస్ మూడ్ కనిపించనున్నది. ఒకవేళ ఈ లాంగ్ వీకెండ్‌లో రాజుగారి గది2 కలెక్షన్లపరంగా ఊపందుకుంటుందా అనే వేచి చూడాల్సిందే.

25 కోట్ల రావాలట

25 కోట్ల రావాలట

రాజుగారి గది2 చిత్రానికి జరిగిన బిజినెస్ బట్టి చూస్తే .. ఈ సినిమాకు దాదాపు 25 కోట్ల రూపాయలు వసూలైతే తప్ప హిట్‌గా పరిగణించడం కష్టమేనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తొలి మూడు రోజులకు ఈ చిత్రం సుమారు 12 కోట్లు వసూళ్లను సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X