Raju Weds Rambai Day 1 Collection: చిన్న సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్.. రాజు వెడ్స్ రాంబాయికి ఎన్ని కోట్లంటే?

తెలుగునాట ఇటీవలి కాలంలో చిన్న సినిమాలు బాగా సందడి చేయడంతో పాటు నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నాయి. ఈ క్రమంలోనే విడుదలకు ముందే అంచనాలు పెంచేసిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఓ డిఫరెంట్ ప్రేమకథగా ప్రచారం దక్కించుకోవడంతో పాటు నెగిటివ్ టాక్ వస్తే అమీర్‌పేట సెంటర్‌లో డ్రాయర్ మీద పరుగులు తీస్తానన్న దర్శకుడి కామెంట్స్‌తో రాజు వెడ్స్ రాంబాయి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

రాజు వెడ్స్ రాంబాయి బడ్జెట్ ఎంత?
సాయిలు కంపాటి దర్శకత్వంలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్వినీ రావు జంటగా నటించగా.. శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, అనితా చౌదరిలు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. వాజీద్ బేగ్ సినిమాటోగ్రాఫర్‌గా, నరేష్ అడుపా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం వహించారు. ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్స్‌‌లో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవిలు ఈ చిత్రాన్ని నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటిలు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చిర రాజు వెడ్స్ రాంబాయి సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..

Raju Weds Rambai Day 1 Expected Box Office Collections Worldwide Tejaswi Rao Movie Good Sart at GBOC

రాజు వెడ్స్ రాంబాయి బ్రేక్ ఈవెన్ టార్గెట్
చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అందమైన లోకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగినట్లుగా ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార ఖర్చులు కలిపి రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు 3 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 3 కోట్ల రూపాయల షేర్.. 6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

రాజు వెడ్స్ రాంబాయిపై అంచనాలు
టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ కారణంగా ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. రిలీజ్‌కు ముందే విడుదలైన పాటలు కూడా జనంలోకి బాగానే వెళ్లాయి. హైదరాబాద్‌తో పాటు కొన్ని ఏరియాలలో ప్రీమియర్స్ ప్రదర్శితమవ్వగా.. వాటికి మంచి ఆదరణ లభించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. బుక్ మై షోలో ఈ సినిమా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లో దాదాపు 5 వేలకు టికెట్స్ అమ్ముడైనట్లుగా తెలుస్తోంది.

రాజు వెడ్స్ రాంబాయి ఫస్ట్ డే కలెక్షన్స్
రాజు వెడ్స్ రాంబాయి తొలి రోజు కలెక్షన్స్ పరిశీలిస్తే... ఈ ప్రేమకథా చిత్రానికి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు 35 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 129 షోలు, బెంగళూరులో 21 షోలు, విజయవాడలో 23 షోలు, విశాఖలో 38 షోలు చొప్పున ప్రదర్శితమయ్యాయి. రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 1.5 కోట్ల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల మధ్యలో ఓపెనింగ్స్ రాబట్టొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X