Raju Weds Rambai Day 10 Collection: రాజు వెడ్స్ రాంబాయి కలెక్షన్ల జోరు.. 10 వ రోజు ఎన్ని కోట్లంటే?
Raju Weds Rambai Collection: తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సన్సేషన్ క్రియేట్ చేస్తున్న మూవీ 'రాజు వెడ్స్ రాంబాయి'. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. భారీ బడ్జెట్ లేకుండానే, కేవలం భావోద్వేగాలతో నడిచే ఈ కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కమర్షియల్ మూవీస్ కు భిన్నంగా, నేటి మధ్యతరగతి యువత ఆలోచనలకు, గ్రామీణ జీవనశైలికి దగ్గరగా ఉండే కథనం 'రాజు వెడ్స్ రాంబాయి'. ఈ మూవీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకస్థానం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొమ్మిదోవ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..
దర్శకుడు సాయిలు కంపాటి ఈ కథను పూర్తిగా నిజ జీవితానికి దగ్గరగా తెరకెక్కించారు. హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజస్వినీ రావు తమ పాత్రలను నేచురల్‌గా పోషించగా, సీనియర్ నటులు శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, అనిత చౌదరి వంటి వారి నటన కథకు బలం చేకూర్చింది. చిన్న సినిమా అయినప్పటికీ నటీనటుల ఎంపిక, సాంకేతిక విభాగాలలో ఎటువంటి రాజీ పడకుండా నిర్మించబడిన ఈ సినిమా ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకుంది. సినిమా మొత్తం బడ్జెట్ రూ.3 కోట్లలోపే పూర్తయినట్టు ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. సురేష్ బొబ్బిలి సంగీతం, వాజీద్ బేగ్ సినిమాటోగ్రఫీ, నరేష్ అడుపా ఎడిటింగ్ ఈ మూడు విభాగాలు కథకు జీవం పోశాయి. ముఖ్యంగా గ్రామీణ భావోద్వేగాలను బీజీఎం ఆకట్టుకుంది.

నిర్మాతలు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి కథ పై నమ్మకంతో ఎటువంటి రాజీ లేకుండా సినిమాను నిర్మించారు. డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో పేరుగాంచిన బన్నీ వాస్, వంశీ నందిపాటి భాగస్వామ్యం కావడంతో సినిమా విడుదల రేంజ్ ఊహించిన దానికంటే ఎక్కువైంది. ట్రేడ్ వర్గాల ప్రకారం..ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ చేరడానికి రూ.6 కోట్లు గ్లోబల్ గ్రాస్ లేదా రూ.3 కోట్లు షేర్ అవసరం. అయితే ప్రారంభం నుంచే వచ్చిన పాజిటివ్ మౌత్‌టాక్ సినిమాను లాభాల దిశగా నడుస్తోంది.
బాక్సాఫీస్‌లో ఊహించని దూకుడు
బాక్సాఫీస్ వద్ద 'రాజు వెడ్స్ రాంబాయి' ప్రయాణం ఆశ్చర్యపరిచే విధంగా సాగింది. విడుదలైన మొదటి రోజే ఈ చిన్న సినిమా రూ.1.15 కోట్ల గ్లోబల్ గ్రాస్ ను తెచ్చి ట్రేడ్ సర్కిల్స్‌ను ఆశ్చర్యంలో ముంచింది. ఫస్ట్ షో నుంచే మౌత్ టాక్ సానుకూలంగా మారడంతో, వెంటనే డిమాండ్ పెరిగి రెండో రోజే స్క్రీన్లు 200 నుంచి 300కి పెరగడం ఆ చిత్రానికి వచ్చిన రిసెప్షన్‌ను స్పష్టం చేసింది. అదే జోరు కొనసాగిస్తూ రెండో రోజు రూ.2.15 కోట్లు, మూడో రోజు రూ.2.6 కోట్లు గ్రాస్ వసూలు చేయడంతో, సినిమా దూసుకపోతుంది.
వారాంతం ముగిసినా రన్ స్లో కాకుండా సటిష్ఠంగా కొనసాగింది. నాలుగో రోజు రూ.1.31 కోట్లు, ఐదో రోజు రూ.1.12 కోట్లు, ఆరవ రోజు రూ.1కోటి, ఏడవ రోజు రూ.0.90 కోట్లు, ఎనిమిదో రోజు రూ.0.80 కోట్లు, తొమ్మిదోవ రోజు రూ. 1 కోటి గ్రాస్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. మొత్తం మీద, కేవలం తొమ్మిది రోజుల్లో దేశవ్యాప్తంగా రూ. 12.25 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 14.74 కోట్లకు పైగా వసూలు చేసినట్టుగా ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి.
ఇక వీకెండ్ లో మరోసారి కలెక్షన్లు మోత మోగుతోంది. పదోవ రోజు (ఆదివారం) కూడా భారీ ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం, మధ్యాహ్నం షోల 22 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉండగా, ఫస్ట్,సెకండ్ షోల బుకింగ్స్ కూడా పెరిగే అవకాశముంది. ఇదే ఫ్లో కొనసాగితే పదోవ రోజు నేషనల్ కలెక్షన్స్ రూ. 1 నుండి రూ. 1.2 కోట్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే..10 రోజులలో రాజు వెడ్స్ రాంబాయి నేషనల్ వైడ్ కలెక్షన్ రూ.13.2 కోట్లకు, వరల్డ్‌వైడ్ రూ.16.40 కోట్లకు చేరే అవకాశముంది. మొత్తానికి చిన్న సినిమా పెద్ద విజయమనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











