Raju Weds Rambai Day 2 Collection: 200 నుంచి 300.. రాజు వెడ్స్ రాంబాయి కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

Raju Weds Rambai Collection: అఖిల్ రాజ్, తేజస్వినీ రావు హీరో-హీరోయిన్లుగా నటించిన మూవీ 'రాజు వెడ్స్ రాంబాయి'. ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించిన దానికంటే భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటి రోజే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, ఈ ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విమర్శకులు కూడా ఈ చిత్రాన్ని హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా మెచ్చుకుంటుండడం సినిమాకి అదనపు బజ్‌ ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..

బడ్జెట్ - బ్రేక్ ఈవెన్ టార్గెట్
సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డోలాముఖి సుబల్టర్న్ ఫిలిమ్స్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేయడం వల్ల డిస్ట్రిబ్యూషన్ లెవల్‌లో కూడా మంచి సపోర్ట్ లభించింది. నటీనటుల రెమ్యునరేషన్, సాంకేతిక దిగ్గజాల వేతనాలు, ప్రమోషన్ ఖర్చులు కలిపి సినిమా బడ్జెట్ సుమారు రూ. 3 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Raju Weds Rambai Day 2 Expected Box Office Collections Worldwide

ఇక సినిమా లాభాల్లోకి రావాలంటే.. షేర్ రూ. 3 కోట్లు, వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 6 కోట్లు వరకూ వసూలు చేయాలి. తొలి రోజు రెస్పాన్స్ , కలెక్షన్లు, మౌత్ పబ్లిసిటీ తీరు చూస్తుంటే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించడం కష్టమైన పని కాదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

సాలిడ్ ఓపెనింగ్స్
రాజు వెడ్స్ రాంబాయి' మూవీ విడుదలైన మొదటి రోజే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. 'రాజు వెడ్స్ రాంబాయి' తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 1.2 కోటి గ్రాస్ కలెక్షన్ అందుకుంది. ఇక మేకర్స్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ మూవీ రూ. 1.47 కోట్ల గ్రాస్ రాబట్టింది.

చిన్న బడ్జెట్ సినిమాకి ఇది భారీ ఓపెనింగ్‌గా చెప్పాలి. ఇటీవల రూరల్ డ్రామా జానర్‌లో వచ్చిన 'లిటిల్ హార్ట్స్' చిత్రం మొదటి రోజు రూ. 1.35 కోట్లు రాబట్టింది. ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయి' ఆ రికార్డును అధిగమించడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. మేకర్స్ ఈ సినిమాను రూరల్ కల్ట్ బ్లాక్ బస్టర్ గా ప్రకటించడం కూడా ప్రేక్షకుల్లో ఇంకా ఆసక్తిని పెంచుతోంది.

రాజు వెడ్స్ రాంబాయి రెండో రోజు కలెక్షన్స్
రాజు వెడ్స్ రాంబాయి రెండోవ రోజు కలెక్షన్స్ పరిశీలిస్తే.. మొదటి రోజు ఊహించిన విధంగా పాజిటివ్ రెస్పాన్స్ రాయడంతో రెండో రోజు నుంచి స్క్రీన్స్ పెంచారు. ఆడియన్స్ డిమాండ్ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా స్క్రీన్లు అదనంగా యాడ్ చేసినట్లు నిర్మాతలు తెలిపారు. ప్రియదర్శి 'ప్రేమంటే', అల్లరి నరేష్ '12ఏ రైల్వే కాలనీ' వంటి సినిమాల పోటీపడుతూ 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ డీసెంట్ ఆక్యుపెన్సీ సొంతం చేసుకుంటుంది.

శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు 36 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. దీంతో రాజు వెడ్స్ రాంబాయి మూవీకి రెండో రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 2 కోట్ల నుంచి రూ. 2.5 కోట్ల మధ్యలో కలెక్షన్స్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మౌత్ టాక్ తో వీకెండ్ లో మరింతగా ఆకట్టుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X