Raju Weds Rambai Day 3 Collection: చిన్న సినిమా, భారీ విజయం.. రాజు వెడ్స్ రాంబాయి కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
Raju Weds Rambai Collection: అఖిల్ రాజ్, తేజస్వినీ రావు నటించిన రొమాంటిక్ డ్రామా 'రాజు వెడ్స్ రాంబాయి'. ఈమూవీ థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. రూరల్ ఎమోషన్, హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ, అన్ని కలిసి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలోలా, ట్రేడ్ వర్గాల్లోలా కూడా పాజిటివ్ స్పందన లభించింది. ఈ స్పందనే సినిమాకు బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్‌గా మారింది. విమర్శకులు కూడా ఈ చిత్రాన్ని "విలేజ్ కల్ట్ లవ్ స్టోరీ"గా రేటింగ్ ఇవ్వడంతో మరింత బజ్ క్రియేట్ అయ్యింది. నేపథ్యంలో సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మూడవ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..
బడ్జెట్ - బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఈ రొమాంటిక్ డ్రామాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించగా, డోలాముఖి సుబల్టర్న్ ఫిలిమ్స్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూషన్ వింగ్‌లో చేరడంతో సినిమాకు మంచి సపోర్ట్ లభించింది. టెక్నికల్ క్రూ రెమ్యునరేషన్, ప్రమోషన్లు, రిలీజ్ ఖర్చులను కలిపి సినిమా బడ్జెట్ సుమారు ₹3 కోట్లలోపే పూర్తయిందని ట్రేడ్ అంచనా.

బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.6 కోట్లు, షేర్ రూ. 3 కోట్లదాకా రావాలన్నది లెక్క. మొదటి రోజు నుంచే వచ్చిన స్పందన చూసి ట్రేడ్ అనలిస్టులు ఈ లక్ష్యం "ఓవర్ అచీవ్" కూడా కావచ్చని అంటున్నారు.ఈ టార్గెట్ ను సులభంగా చేరుకునే అవకాశం ఉందని ఎగ్జిబిటర్లు అంచనా వేస్తున్నారు.
బాక్సాఫీస్ షాకింగ్ ఓపెనింగ్
సినిమా విడుదలైన తొలి రోజు 'రాజు వెడ్స్ రాంబాయి'కు ఊహించని బాక్సాఫీస్ ఓపెనింగ్ వచ్చింది. ట్రేడ్ అంచనాల ప్రకారం వరల్డ్ వైడ్‌గా సినిమా ₹1.2 కోట్లు గ్రాస్ సాధించినట్టు తెలపగా.. మూవీ మేకర్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే రూ. 1.47 కోట్ల గ్రాస్ రాబట్టినది ప్రకటించారు. ఇటీవల రూరల్ డ్రామా జానర్‌లో వచ్చిన 'లిటిల్ హార్ట్స్' చిత్రం మొదటి రోజు రూ. 1.35 కోట్లు రాబట్టింది. ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయి' ఆ రికార్డును అధిగమించడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.
రెండో రోజు వసూళ్లు చూస్తే.. మౌత్ టాక్‌తో ఈ సినిమా ఫైర్ అయ్యిందనే చెప్పాలి. పాజిటివ్ రివ్యూలు, ప్రేక్షకుల స్పందన చూసి మొదట పరిమిత సంఖ్యలో ఉన్న స్క్రీన్లు 200 నుంచి 300ల వరకు పెంచారు. మూవీ టీం వెల్లడించిన ప్రకారం.. సినిమా మొదటి 2 రోజుల్లోనే ఇండియా మొత్తంగా ₹4.04 కోట్ల గ్రాస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.3 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం బిగ్ హైలైట్. ఇందులో నైజాంలోనే కలెక్షన్లు రూ. 2 కోట్లు దాటుతున్నాయి. చిన్న బడ్జెట్ ఫిల్మ్‌కు ఇలాంటి కలెక్షన్స్ రావడం చాలా అరుదు.
ఇక మూడు రోజు కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలి 2 రోజుల్లోనే సినిమాకు ఊహించిన విధంగా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ప్రియదర్శి 'ప్రేమంటే', అల్లరి నరేష్ '12ఏ రైల్వే కాలనీ' వంటి సినిమాల పోటీపడుతూ 'రాజు వెడ్స్ రాంబాయి'మూవీ భారీ ఆక్యుపెన్సీ సొంతం చేసుకుంటుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు 38 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్టు తెలుస్తోంది. ఈ వేవ్ ను చూస్తే.. రాజు వెడ్స్ రాంబాయి మూవీకి మూడో రోజు వరల్డ్ వైడ్‌గా రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల మధ్యలో కలెక్షన్స్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ట్రేడ్ వర్గాల ప్రకారం మౌత్ టాక్ పెరగడంతో భారీ కలెక్షన్లు అందుకుంది.వీకెండ్ ప్రభావం కారణంగా సినిమా మరిన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు చూపే అవకాశం ఉంది. ఇప్పటి మూవీ టీం ఇది కదా విజయం అంటే అనే పోస్టర్స్ విడుదల చేశారు. ఈ విధంగానే కలెక్షన్స్ కొనసాగుతే.. ఈ వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి.. లాభాల బాటపడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











