Raju Weds Rambai Day 4 Collection: రాజు వెడ్స్ రాంబాయి కలెక్షన్ల జోరు.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది రాజు వెడ్స్ రాంబాబు. తద్వారా కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని నిరూపించింది. గ్రామీణ వాతావరంలో విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన రాజు వెడ్స్ రాంబాయి చిత్రం నిర్మాతలకు మంచి వసూళ్లు సాధించి పెడుతోంది. ఈ నేపథ్యంలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..
రాజు వెడ్స్ రాంబాయి బడ్జెట్ ఎంత?
సాయిలు కంపాటి దర్శకత్వంలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్వినీ రావు జంటగా నటించగా.. శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, అనితా చౌదరిలు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. వాజీద్ బేగ్ సినిమాటోగ్రాఫర్‌గా, నరేష్ అడుపా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం వహించారు. ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్స్‌లో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవిలు ఈ చిత్రాన్ని నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటిలు ఈ సినిమా విడుదల బాధ్యతలు తీసుకున్నారు. నవంబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

రాజు వెడ్స్ రాంబాయి బ్రేక్ ఈవెన్ టార్గెట్
చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార ఖర్చులు కలిపి రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు 3 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 3 కోట్ల రూపాయల షేర్.. 6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
రాజు వెడ్స్ రాంబాయి మూడు రోజుల కలెక్షన్స్
రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు తొలి రోజున ఇండియా వైడ్‌గా 1.15 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.15 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.6 కోట్ల రూపాయలు చొప్పున 5.8 కోట్ల రూపాయల నికర వసూళ్లు.. 6.8 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక నార్త్ అమెరికా తదితర దేశాలతో కలిపి ఓవర్సీస్‌లో రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు 35 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఈ ప్రేమకథా చిత్రానికి ఇప్పటి వరకు 7.15 కోట్ల రూపాయలు వసూళ్లు వచ్చాయి.
రాజు వెడ్స్ రాంబాయి నాలుగో రోజు కలెక్షన్స్
వీకెండ్ వరకు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రాజు వెడ్స్ రాంబాయి చిత్రం.. వర్కింగ్ డే అయిన సోమవారం కూడా సాలీడ్‌గా బుకింగ్స్ అందుకున్నట్లు నివేదికలు చెబుతున్నారు. నాలుగో రోజు సాయంత్రం 5 గంటల వరకు రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు 24 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాలుగో రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 2 కోట్ల రూపాయలు రాబట్టొచ్చని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. దాంతో కేవలం నాలుగు రోజుల్లో రాజు వెడ్స్ రాంబాయి చిత్రం 10 కోట్ల మార్క్ అందుకుని సంచలనం సృష్టించనుంది.


Click it and Unblock the Notifications











