Raju Weds Rambai Day 5 Collection: చిన్న సినిమాకు భారీ కలెక్షన్లు.. ‘రాజు వెడ్స్ రాంబాయి' కి ఎన్ని కోట్లు ?

Raju Weds Rambai Collection: చిన్న సినిమాగా విడుదలైనా 'రాజు వెడ్స్ రాంబాయి' భారీ హంగామా సృష్టించింది. కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారన్న సిద్ధాంతాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది. గ్రామీణ నేపథ్యంతో మమేకమైన ప్రేమకథ,ఎమోషన్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.ఈ నేపథ్యంలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఐదోవ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఎంత బడ్జెట్‌లో తెరకెక్కింది?
సాయిలు కంపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామాలో అఖిల్ రాజ్-తేజస్వినీ రావు జంటగా నటించారు. శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, అనితా చౌదరి వంటి నటులు కీలక పాత్రల్లో మెప్పించారు. ప్రీ-ప్రొడక్షన్ నుంచి ప్రమోషన్ వరకు ఖర్చులను కలిపి, నటీనటుల పారితోషికాలు, టెక్నికల్ టీమ్ రెమ్యునరేషన్, రిలీజ్ ఎక్స్‌పెన్సెస్ అన్ని కలిపి సినిమా మొత్తం బడ్జెట్ రూ. 3 కోట్లు పరిధిలోనే పూర్తయిందని ట్రేడ్ సర్కిల్స్ అంచనా. ఈ చిత్రానికి వాజీద్ బేగ్ సినిమాటోగ్రఫీ, నరేష్ అడుపా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, సంగీతాన్ని సురేష్ బొబ్బిలి అందించాడు. లోకల్ రూరల్ ఫీల్‌ను హైలైట్ చేసే ఆయన బీజీఎం,మ్యూజికల్ ఎలెమెంట్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి.

Raju Weds Rambai Day 5 Expected Box Office Collections Worldwide

బ్రేక్-ఈవెన్ టార్గెట్ ఎంత?
చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్‌పై నమ్మకంతో హై ప్రొడక్షన్ విలువలు పాటించారు. డోలాముఖి సుబల్టర్న్ ఫిలిమ్స్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూషన్ వింగ్‌లో చేరడంతో సినిమాకు మంచి సపోర్ట్ లభించింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.6 కోట్లు, షేర్ రూ. 3 కోట్లదాకా రావాలన్నది లెక్క. మొదటి రోజు నుంచే వచ్చిన స్పందన చూసి ట్రేడ్ అనలిస్టులు ఈ లక్ష్యం "ఓవర్ అచీవ్" కూడా కావచ్చని అంటున్నారు.ఈ టార్గెట్ ను సులభంగా చేరుకునే అవకాశం ఉందని ఎగ్జిబిటర్లు అంచనా వేస్తున్నారు.

బాక్సాఫీస్‌ షాకింగ్ ఓపెనింగ్
సినిమా విడుదలైన తొలి రోజు 'రాజు వెడ్స్ రాంబాయి'కు ఊహించని బాక్సాఫీస్ ఓపెనింగ్ వచ్చింది. ట్రేడ్ అంచనాల ప్రకారం వరల్డ్ వైడ్‌గా సినిమా రూ. 1.2 కోట్లు గ్రాస్ సాధించినట్టు తెలపగా.. మూవీ మేకర్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే రూ. 1.47 కోట్ల గ్రాస్ రాబట్టినది ప్రకటించారు. ఇక తొలి రోజు పాజిటివ్ రివ్యూలు, ప్రేక్షకుల స్పందన చూసి మొదట పరిమిత సంఖ్యలో ఉన్న స్క్రీన్లు 200 నుంచి 300ల వరకు పెంచారు. రెండో రోజు రూ. 2.15 కోట్లు, మూడో రోజు రూ. 2.6 కోట్లు, నాలుగవ రోజు 1.31 కోట్లు అందుకుంది. ఇలా నాలుగు రోజుల్లో రూ. 7.1 కోట్లు నికర వసూళ్లు.. 8.6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. మూవీ టీం వెల్లడించిన ప్రకారం.. సినిమా మొదటి 4 రోజుల్లోనే ఇండియా మొత్తంగా రూ.9.08 కోట్ల గ్రాస్ సాధించినట్టు ప్రకటించారు. ఇలా ఒక్క చిన్న బడ్జెట్ ఫిల్మ్‌కు ఇలాంటి కలెక్షన్స్ రావడం చాలా అరుదు.

ఇక ఐదవ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. వీకెండ్ వరకు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రాజు వెడ్స్ రాంబాయి మూవీ వర్కింగ్ డే అయిన మంగళవారం కూడా ప్రియదర్శి 'ప్రేమంటే', అల్లరి నరేష్ '12ఏ రైల్వే కాలనీ' వంటి సినిమాల పోటీపడుతూ 'రాజు వెడ్స్ రాంబాయి'మూవీ భారీ ఆక్యుపెన్సీ సొంతం చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఐదోవ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు 24 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్టు తెలుస్తోంది.ఇక ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ వేవ్ ను చూస్తే.. రాజు వెడ్స్ రాంబాయి మూవీకి 5వ రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 1 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల మధ్యలో కలెక్షన్స్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో ఐదు రోజుల్లో ఈ మూవీ రూ. 8.5 కోట్లకు చేరువ కాబోతుందని అంచనా. ఈ రెస్పాన్స్ చూస్తే.. రాజు వెడ్స్ రాంబాయి మూవీ 10 కోట్ల మార్క్ ను అతి త్వరలోనే అందుకోబోతుందని అంచనా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X