Raju Weds Rambai Day 6 Collection: బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తోన్న రాజు వెడ్స్ రాంబాయి.. 6వ రోజు ఎన్ని కోట్లంటే?
Raju Weds Rambai Collection: చిన్న బడ్జెట్ మూవీగా థియేటర్లలోకి వచ్చిన 'రాజు వెడ్స్ రాంబాయి' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. కథ,భావోద్వేగాలపై ఆధారపడిన సినిమాలు ఎప్పటికీ నిలబడతాయని మరోసారి నిరూపించిన చిత్రం ఇది. గ్రామీణ జీవనశైలితో మిళితమైన ప్రేమకథ, అద్భుతమైన ఎమోషన్ ప్యాకేజింగ్ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా సోషల్ మీడియా నుంచి మౌత్ పబ్లిసిటీ వరకూ భారీ బూస్ట్ అందుకుంది. ఈ నేపథ్యంలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఆరవ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..
బడ్జెట్ ఎంత?
సాయిలు కంపాటి దర్శకత్వంలో అఖిల్ రాజ్-తేజస్వినీ రావు లు ప్రేమ జంటగా మెప్పించారు. శివాజీరాజా, చైతన్య జొన్నలగడ్డ, అనిత చౌదరి వంటి సీనియర్ నటుల ప్రెజెన్స్ తో సినిమాకు బలం చేకూర్చింది. సినిమా షూటింగ్, నటీనటుల పారితోషికాలు, టెక్నికల్ స్టాఫ్ ఖర్చులు, ప్రమోషన్‌లతో కలిపి మొత్తం బడ్జెట్ రూ. 3 కోట్లు పరిధిలో పూర్తయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సురేష్ బొబ్బిలి సంగీతం, వాజీద్ బేగ్ సినిమాటోగ్రఫీ, నరేష్ అడుపా ఎడిటింగ్ సినిమా టోన్‌ను భారీగా ఎలివేట్ చేశాయి. పాటలు, రూరల్ బీజీఎం సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి.

బ్రేక్-ఈవెన్ లక్ష్యం
చిన్న సినిమా అయినా నాణ్యమైన ప్రొడక్షన్ వాల్యూస్‌తో ప్రేక్షకుల ముందు నిలిపిన నిర్మాతలు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి. డోలాముఖి సుబాల్టర్న్ ఫిలిమ్స్, మాన్‌సూన్ టేల్స్ బ్యానర్ల క్రింద రూపొందిన ఈ మూవీకి డిస్ట్రిబ్యూషన్‌లో బన్నీ వాస్, వంశీ నందిపాటి సపోర్టు లభించడంతో రిలీజ్ రేంజ్ పెరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమాకు బ్రేక్-ఈవెన్ కోసం వరల్డ్‌వైడ్ రూ. 6 కోట్లు గ్రాస్, దాదాపు రూ. 3 కోట్లు షేర్ కావాల్సింది. అయితే మంచి రివ్యూలు, స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా మూవీ ఇప్పటికే ఈ లెనింగ్స్‌ను దాటి లాభాల దిశగా దూసుకెళ్తోంది. కొన్ని పెద్ద సినిమాలు వెనక్కి వెళ్లిపోయిన సమయంలో కంటెంట్ ఆధారంగా నిలిచిన 'రాజు వెడ్స్ రాంబాయి', బాక్సాఫీస్ దుమ్మురేపుతోంది.
బాక్సాఫీస్ షాకింగ్ ఓపెనింగ్
తొలి రోజు 'రాజు వెడ్స్ రాంబాయి' ఊహించని ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకుంది. ట్రేడ్ అంచనాల ప్రకారం వరల్డ్ వైడ్‌గా సినిమా రూ. 1.15కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇక తొలి రోజు పాజిటివ్ రివ్యూలు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో స్క్రీన్లు 200 నుంచి 300ల వరకు పెంచారు. దీంతో రెండో రోజు రూ. 2.15 కోట్లు, మూడో రోజు రూ. 2.6 కోట్లు చేసింది. ఇక సోమవారం (4వ రోజు) రూ. 1.31 కోట్లు అందుకోగా, 5 వరోజు వర్క్‌డే ప్రభావం కారణంగా కలెక్షన్లు స్వల్పంగా తగ్గినా, ఇంకా స్థిరంగా కొనసాగుతూ మంగళవారం రూ. 1.12 కోట్లు వసూలు చేసింది. ఇలా ఐదు రోజుల్లో రూ.8.3 కోట్లు నికర వసూళ్లు..10.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
ఇక ఆరవ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. వీకెండ్ లో దుమ్మురేపిన రాజు వెడ్స్ రాంబాయి మూవీ వర్కింగ్ డేస్ లో అదే జోరు కొనసాగిస్తుంది.పైగా.. ప్రియదర్శి 'ప్రేమంటే', అల్లరి నరేష్ '12ఏ రైల్వే కాలనీ'వంటి సినిమాల పోటీపడుతూ 'రాజు వెడ్స్ రాంబాయి'మూవీ భారీ ఆక్యుపెన్సీ సొంతం చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆరవ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు 24 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్టు తెలుస్తోంది.
ఇక ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని చూస్తే.. రాజు వెడ్స్ రాంబాయి మూవీకి 6వ రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 1 కోట్ల నుంచి రూ.1.3 కోట్ల మధ్యలో కలెక్షన్స్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో ఆరు రోజుల్లో ఈ మూవీ రూ.9.5 కోట్ల నెట్ , గ్రాస్ కలెక్షన్స్ రూ. 11.5 కోట్లకు చేరువ కాబోతుందని అంచనా. చిన్న బడ్జెట్, కొత్త ముఖాలు అయినా.. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ రావడం వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.


Click it and Unblock the Notifications











