Raju Weds Rambai Day 7 Collection: దుమ్మురేపుతోన్న రాజు వెడ్స్ రాంబాయి కలెక్షన్స్.. 7వ రోజు ఎన్ని కోట్లంటే?
Raju Weds Rambai Collection: చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చిన 'రాజు వెడ్స్ రాంబాయి' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. కథలోని గ్రామీణ వాతావరణం, నిజ జీవిత భావోద్వేగాలు, సహజ ప్రేమకథ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ దక్కడంతో ఈ సినిమా సోషల్ మీడియాలోనుంచి మౌత్ పబ్లిసిటీ వరకూ భారీ బూస్ట్ సాధించింది. కొన్ని పెద్ద సినిమాలే కలెక్షన్లలో నిలబడలేకపోతున్న సమయంలో, కంటెంట్ ఆధారంగా ఈ సినిమా హైలైట్ నిలిచింది. ఈ నేపథ్యంలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఏడవ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..
సాయిలు కంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథలో అఖిల్ రాజ్ - తేజస్వినీ రావు ప్రేమ జంటగా సహజ నటనతో మెప్పించారు. వారితో పాటు శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, అనిత చౌదరి వంటి సీనియర్ యాక్టర్స్ తమ నటనతో సినిమాకు బలం చేకూర్చారు. ట్రేడ్ వర్గాల ప్రకారం నటీనటుల పారితోషికం, షూటింగ్ ఖర్చులు, టెక్నికల్ స్టాఫ్, ప్రమోషన్లు కలిపి సినిమాకు సుమారు రూ. 3 కోట్ల బడ్జెట్ వచ్చింది. చిన్న సినిమా అయినా ప్రొడక్షన్ క్వాలిటీని తగ్గించకుండా మేకింగ్ కొనసాగించడం నిర్మాతలకు ఈ కథ నమ్మకానికి నిదర్శనం. ఈ సినిమాకు సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రాఫర్ వాజీద్ బేగ్, ఎడిటర్ నరేష్ అడుపా అందించారు. ప్రత్యేకంగా బీజీఎం, రూరల్ పాటలు ఈ సినిమాకి అదనపు బలం.

బ్రేక్-ఈవెన్ లక్ష్యం
వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమా డోలాముఖి సుబాల్టర్న్ ఫిలిమ్స్, మాన్‌సూన్ టేల్స్ బ్యానర్ల నుంచి విడుదలైంది. డిస్ట్రిబ్యూషన్‌లో బన్నీ వాస్, వంశీ నందిపాటి సపోర్టు లభించడంతో రిలీజ్ రేంజ్ పెరిగింది. ట్రేడ్ లెక్కలు చెబుతున్నట్టు సినిమా బ్రేక్-ఈవెన్ కోసం వరల్డ్‌వైడ్ రూ. 6 కోట్ల గ్రాస్, దాదాపు రూ. 3 కోట్ల షేర్ చేరుకోవాలి. అయితే అద్భుతమైన స్పందన రాయడంతో సినిమా బ్రేక్ ఈవెన్ గ్రాస్ చేసి.. ఇప్పటికే లాభాల దిశగా దూసుకెళ్తోంది. కొన్ని భారీ సినిమాలు వెనక్కి తగ్గిన సమయంలో చిన్న సినిమా ఇలా నిలబడటం చాలా అరుదు.
బాక్సాఫీస్ షాకింగ్ ఓపెనింగ్
రాజు వెడ్స్ రాంబాయి మూవీ ఊహించని ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకుంది. ట్రేడ్ అంచనాల ప్రకారం వరల్డ్ వైడ్‌గా సినిమా రూ.1.15 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇక తొలి రోజు పాజిటివ్ రివ్యూల ప్రభావంతో రెండవ రోజు థియేటర్ల సంఖ్య 200 నుంచి 300కు పెరిగింది. దీంతో రెండో రోజు రూ. 2.15 కోట్లు, మూడో రోజు రూ. 2.6 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక సోమవారం అయినా.. కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. 4వ రోజు రూ. 1.31 కోట్లు అందుకోగా, 5 వరోజు రూ. 1.12 కోట్లు,6వ రోజు రూ. 1 కోటి వసూలు చేసింది. ఇలా ఆరు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.9.45 కోట్లు గ్రాస్ వసూళ్లు చేయగా.. వర్డల్ వైడ్ గా 11.59 కోట్ల గ్రాస్ వసూలు అందుకున్నట్లు తెలుస్తోంది.
7వ రోజు కలెక్షన్స్
వీకెండ్ లో హై ఆక్యుపెన్సీ నమోదు చేసిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా, వర్కింగ్ డేస్‌లో కూడా అదే జోరు కొనసాగిస్తోంది. ప్రియదర్శి 'ప్రేమంటే', అల్లరి నరేష్ '12ఏ రైల్వే కాలనీ'లాంటి సినిమాలు పోటీలో ఉన్నా, థియేటర్లలో 'రాజు వెడ్స్ రాంబాయి' కలెక్షన్లు తగ్గలేదు. 7వ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు 21% ఆక్యుపెన్సీ నమోదైనట్టు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి.
ఫస్ట్, సెకండ్ షోల్లో బుకింగ్స్ ఇంకా పెరుగుతున్నాయి. ఇదే ఫ్లో కొనసాగితే 7వ రోజు నేషనల్ వైడ్ రూ.1 - రూ. 1.2 కోట్లు గ్రాస్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన.. ఏడు రోజుల్లో నేషనల్ కలెక్షన్స్ రూ. 10.5 కోట్లు, వరల్డ్‌వైడ్ ₹12.5 కోట్ల మార్క్ చేరవచ్చని అంచనా. కొత్త ముఖాలు, చిన్న బడ్జెట్ అయినప్పటికీ 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాకు ప్రేక్షకులు చూపిస్తున్న స్పందన ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.


Click it and Unblock the Notifications











