Raju Weds Rambai Day 8 Collection: రాజు వెడ్స్ రాంబాయి షాకింగ్ కలెక్షన్స్.. 8వ రోజు ఎన్ని కోట్లంటే?

Raju Weds Rambai Collection: ఇటీవల తెలుగు సినిమా బాక్సాఫీస్‌పై అద్భుతమైన ప్రభావం చూపించిన చిన్న సినిమాల్లో 'రాజు వెడ్స్ రాంబాయి' ఒకటి. భారీ బడ్జెట్ మూవీ కాకపోయినా, కేవలం కథ, భావోద్వేగాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకే రప్పించడంలో విజయం సాధించింది. విడుదలైన తొలి రోజునుంచే గ్రామీణ ప్రేమకథా నేపథ్యం, సహజ సంభాషణలు, నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు అన్ని ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. ఈ నేపథ్యంలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఎనిమిదో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..

దర్శకుడు సాయిలు కంపాటి నేరుగా హృదయాన్ని తాకేలా కథను ప్రెజెంట్ చేశారు. హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజస్వినీ రావు ఇద్దరూ చాలా బాగా నటించారు. వీరద్దరి సహజ నటనతో పాటు సీనియర్ నటులు శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, అనిత చౌదరి వంటి వారు తమ పాత్రల్లో బలం చేకూర్చారు. నిర్మాణపరంగా కూడా ఈ చిన్న సినిమా ఎలాంటి రాజీ పడకుండా రూపొందించబడింది. నటీనటులు, టెక్నికల్ టీమ్, ప్రమోషన్ ఖర్చులు కలిపి సినిమా బడ్జెట్ సుమారుగా రూ.3 కోట్లలోపే పూర్తయింది. సురేష్ బొబ్బిలి సంగీతం, వాజీద్ బేగ్ సినిమాటోగ్రఫీ, నరేష్ అడుపా ఎడిటింగ్ సినిమాకు ప్రాణంగా పోశాయి. ప్రత్యేకంగా బీజీఎం, రూరల్ ప్రేక్షకుల భావోద్వేగాలకు దగ్గరయ్యాయి.

Raju Weds Rambai Day 8 Expected Box Office Collections Worldwide

నిర్మాతలు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి సినిమా మీద నమ్మకం ఉంచి మేకింగ్‌లో ఎలాంటి రాజీ పడలేదు. డిస్ట్రిబ్యూషన్‌లో బన్నీ వాస్, వంశీ నందిపాటి జాయిన్ కావడంతో సినిమా రిలీజ్ రేంజ్ ఊహించిన దానికంటే పెద్ద స్థాయికి పెరిగింది. ట్రేడ్ వర్గాలు తెలిపినట్టు సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ₹6 కోట్ల గ్రాస్ లేదా సుమారు ₹3 కోట్ల షేర్ అవసరం. అయితే విడుదల తరువాత వచ్చిన సెన్సేషన్ రిస్పాన్స్ ప్రభావంతో సినిమాకు బ్రేక్ ఈవెన్ చేరుకోవడం మాత్రమే కాదు, ఆపై లాభాల దిశగా దూసుకెళ్తోంది. భారీ సినిమాలు సైతం స్టెబిలిటీ సాధించడంలో ఇబ్బంది పడుతున్న సమయంలో ఇదొక అరుదైన విజయంగా చెబుతున్నారు.

బాక్సాఫీస్ విషయానికి వస్తే, ఊహించని ఓపెనింగ్ ఈ సినిమాకు భారీ అడ్వాంటేజ్‌గా మారింది. విడుదలైన తొలి రోజునే వరల్డ్‌వైడ్‌గా రూ. 1.15 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ట్రేడ్‌లో షాక్ క్రియేట్ చేసింది. ఫస్ట్ షో నుంచే వచ్చిన పాజిటివ్ రివ్యూల ప్రభావంతో రెండవ రోజే థియేటర్ల సంఖ్య 200 నుంచి 300కి పెరగడం సినిమా మీద ఉన్న డిమాండ్‌కు నిదర్శనం. రెండవ రోజు రూ.2.15 కోట్లు, మూడవ రోజు రూ. 2.6 కోట్ల గ్రాస్ అందుకోవడంతో సినిమా ట్రాక్ పక్కాగా సెట్ అయింది. నాలుగో రోజు రూ. 1.31 కోట్లు, ఐదో రోజు రూ.1.12 కోట్లు, ఆరవ రోజు రూ. 1 కోటి, ఏడవ రోజు రూ. 0.9 కోట్లు వసూలు చేసింది. ఇలా ఏడు వారాల వ్యవధిలో దేశవ్యాప్తంగా ₹10.45 కోట్ల గ్రాస్, వరల్డ్‌వైడ్‌గా ₹12.93 కోట్ల వరకు చేరినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి.

వీకెండ్ తర్వాత కలెక్షన్లు తగ్గుతాయని భావించినా, ఈ సినిమా మాత్రం అదే జోరును కొనసాగిస్తోంది. ఎనిమిదో రోజు (శుక్రవారం)కూడా ఆక్యుపెన్సీ భారీగానే ఉండటం విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. మధ్యాహ్నం షోల వరకు 20 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్టు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. ఫస్ట్, సెకండ్ షోల్లో బుకింగ్స్ ఇంకా పెరుగుతున్నాయి. ఇదే ఫ్లో కొనసాగితే 7వ రోజు నేషనల్ వైడ్ రూ.1 కోటి వరకు గ్రాస్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఎనిమిది రోజుల్లో నేషనల్ కలెక్షన్స్ రూ. 11.30 కోట్లు, వరల్డ్‌వైడ్ రూ.13.5 కోట్ల మార్క్ చేరవచ్చని అంచనా. కొత్త ముఖాలు, చిన్న బడ్జెట్ అయినప్పటికీ 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాకు ప్రేక్షకులు చూపిస్తున్న స్పందన ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X