Raju Weds Rambai Day 9 Collection: రాజు వెడ్స్ రాంబాయి కలెక్షన్ల మోత.. 9వ రోజు ఎన్ని కోట్లంటే?

Raju Weds Rambai Collection: తెలుగు సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఇటీవల అద్భుతమైన ప్రభావం చూపించిన చిన్న సినిమాల్లో 'రాజు వెడ్స్ రాంబాయి' ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. భారీ బడ్జెట్ లేకుండానే, కేవలం భావోద్వేగాలతో నడిచే కథతో ఈ మూవీ ప్రేక్షకులను ఆకర్షించగలిగింది. గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథ, సహజమైన పాత్రలు అన్ని కలిసి ఈ సినిమాను థియేటర్ల వరకు ప్రేక్షకులను రప్పించగలిగాయి. రొటీన్ కమర్షియల్ టెంప్లేట్‌కు భిన్నంగా, నేటి మధ్యతరగతి యువత ఆలోచనలకు, గ్రామీణ జీవనశైలికి దగ్గరగా ఉండే కథనం 'రాజు వెడ్స్ రాంబాయి'ని ప్రేక్షకుల హృదయాల్లో నిలబెట్టింది. ఈ నేపథ్యంలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొమ్మిదోవ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..

దర్శకుడు సాయిలు కంపాటి ఈ కథను ఎంతో నేరుగా, సహజంగా చిత్రీకరించారు. హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజస్వినీ రావు ఇద్దరూ సహజంగా తమ పాత్రలను పోషించగా, సీనియర్ నటులు శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, అనిత చౌదరి కథకు బలం చేకూర్చే విధంగా నటించారు. చిన్న సినిమా అయినప్పటికీ, నటీనటులు, సాంకేతిక విభాగాల మధ్య రాజీ లేకుండా నిర్మించబడిన ఈ సినిమా ప్రేక్షకుల్లో నమ్మకం పెంచింది. మొత్తం మేకింగ్, ప్రమోషన్ ఖర్చులు కలుపుకుని సినిమా బడ్జెట్ సుమారు రూ.3 కోట్లలోపే ఉండడం గమనార్హం. సురేష్ బొబ్బిలి సంగీతం, వాజీద్ బేగ్ సినిమాటోగ్రఫీ, నరేష్ అడుపా ఎడిటింగ్ అన్ని సినిమాకు ప్రాణం పోశాయి. ముఖ్యంగా బీజీఎం, రూరల్ ఎమోషన్‌ను ఎత్తిచూపిస్తూ ప్రేక్షకులను సినిమాతో అట్టాచయ్యేలా చేసింది.

Raju Weds Rambai Day 9 Expected Box Office Collections Worldwide

నిర్మాతలు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి కథపై నమ్మకం ఉంచి, నిర్మాణంలో ఎటువంటి రాజీ పడలేదు. డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో పరిశ్రమలో పేరుగాంచిన బన్నీ వాస్, వంశీ నందిపాటి చేరడంతో సినిమా విడుదల రేంజ్ ఊహించిన దానికంటే పెరిగింది. ట్రేడ్ వర్గాల ప్రకారం, ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కోసం ప్రపంచవ్యాప్తంగా రూ. 6 కోట్ల గ్రాస్ లేదా సుమారు రూ. 3 కోట్ల షేర్ అవసరం. అయితే, విడుదల మొదలైన దశ నుంచే వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ ఈ సినిమాను బ్రేక్ ఈవెన్ దాటి లాభాల దిశగా నడుస్తోంది.

బాక్సాఫీస్ లో ఈ సినిమా ప్రయాణం ఆశ్చర్యపరిచే విధంగా సాగింది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.1.15 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ సర్కిల్స్‌ను ఆశ్చర్యపరిచింది. ఫస్ట్ షో నుంచే వచ్చిన పాజిటివ్ రివ్యూల ప్రభావంతో రెండో రోజే థియేటర్ల సంఖ్య 200 నుంచి 300కి పెరగడం, సినిమా మీద ఉన్న డిమాండ్‌కు నిదర్శనం. రెండో రోజు రూ.2.15 కోట్లు, మూడో రోజు రూ.2.6 కోట్లు గ్రాస్ వసూలు చేయడంతో, సినిమా దూసుకుపోయే ట్రాక్‌లోకి ప్రవేశించింది. నాలుగో రోజు రూ. 1.31 కోట్లు, ఐదో రోజు రూ. 1.12 కోట్లు, ఆరవ రోజు రూ. 1 కోటి, ఏడవ రోజు రూ.0.90 కోట్లు, ఎనిమిదో రోజు రూ. 0.80 కోట్లు గ్రాస్ సాధించాయి. ఇలా మొదటి ఎనిమిది రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ₹11.25 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా ₹13.93 కోట్లకు పైగా చేరినట్టు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి.

వీకెండ్ లో మరోసారి కలెక్షన్లు జోరు కొనసాగుతోంది. తొమ్మిదో రోజు (శనివారం) కూడా భారీ ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం, మధ్యాహ్నం షోల 24 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉండగా, ఫస్ట్, సెకండ్ షోల బుకింగ్స్ మరింత పెరిగాయి. ఇదే ఫ్లో కొనసాగితే తొమ్మిదో రోజు నేషనల్ కలెక్షన్స్ ₹1 నుండి ₹1.5 కోట్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే.. 9 రోజులలో నేషనల్ వైడ్ కలెక్షన్ రూ. 12.30 కోట్లకు, వరల్డ్‌వైడ్ రూ. 14.80 కోట్లకు చేరే అవకాశముంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X