Rakasa Day 1 Collections: రాకాస బాక్సాఫీస్ కలెక్షన్స్... నిహారిక కొణిదెల మూవీకి ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన మూవీ రాకాస. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా రాకాసను నిర్మించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏప్రిల్ 3న రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రాకాస మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

రాకాస బడ్జెట్ అండ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్‌, ప్రమోషనల్ కార్యక్రమాలతో రాకాస మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, 3డీ ఎఫెక్ట్స్ కోసం నిహారిక ఖర్చుకు వెనుకాడకుండా రాకాసను నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో పాటు నిహారిక కొణిదెల అండ్ టీమ్ నిర్వహించిన ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాకాస మూవీ థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... ఆంధ్రలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, నైజాంలో 4 కోట్ల రూపాయలు మేర 10 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

Rakasa Day 1 Expected Box Office Collections Worldwide Sangeeth Shobhan s film good start at GBOC

రాకాస బ్రేక్ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్ కలిపి 2.5 కోట్ల రేంజ్‌లో అమ్ముడయ్యాయి. మొత్తంగా రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా 12.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నిహారిక కొణిదెల మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్‌ను బ్రేక్ఈవెన్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. రాకాసకు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే చేసినట్లుగా అనలిస్టులు చెబుతున్నారు. ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దాదాపు 10 కోట్ల రూపాయల ఫ్యాన్సీ ధరను వెచ్చించి దక్కించుకుంది. అలాగే మ్యూజిక్, శాటిలైట్ రైట్స్ ద్వారా కూడా బాగానే గిట్టుబాటు అయినట్లుగా తెలుస్తోంది.

రాకాస ప్రీమియర్స్ కలెక్షన్స్
రాకాస మూవీకి నార్త్ అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. నార్త్ అమెరికాలో రాకాసకు 233 సెంటర్స్‌లో 361 షోలకు గాను 2274 టికెట్లు అమ్ముడయ్యాయి. తద్వారా 32,899 డాలర్లు (భారత కరెన్సీలో 30.48 లక్షల రూపాయలు) వసూలయ్యాయి. అంచనాల నేపథ్యంలో రాకాసకు అడ్వాన్స్ బుకింగ్‌ కూడా బాగున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. బుక్ మై షోలో గంటకు 4,120 టికెట్లు బుక్ అవుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

రాకాస తొలిరోజు కలెక్షన్స్
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో రాకాస మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. గత కొద్దిరోజులుగా యాక్షన్, మాస్ సినిమాలే థియేటర్‌లలో రాజ్యమేలుతుండటంతో ఫాంటసీ, హార్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన రాకాసకు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలిరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు రాకాస మూవీకి ఇండియాలో 588 షోలు ప్రదర్శితమవ్వగా 27 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ నివేదించింది. అయితే ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు ఇండియాలో రాకాస మూవీ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ కనిపిస్తున్నది. తొలిరోజు నిహారిక కొణిదెల మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 4 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నైట్ షోలకు డిమాండ్ పెరిగితే ఈ రేంజ్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X