Rakasa Day 10 Collections: రాకాస బాక్సాఫీస్ కలెక్షన్స్.. సంగీత్ శోభన్ మూవీకి 10వ రోజు ఎంతంటే?

నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన లవ్, ఫాంటసీ, హర్రర్ కామెడీ మూవీ రాకాస విజయవంతంగా ప్రదర్శితమవుతూ 10వ రోజుకు చేరుకుంది. ఈ శుక్రవారం విడుదలైన సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా రాకాసకు మంచి ఆక్యూపెన్సీ నమోదవుతోంది. ఈ నేపథ్యంలో రాకాస మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? 10వ రోజు వసూళ్లు ఎంత? ఈ వివరాల్లోకి వెళితే..

రాకాసలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించగా.. మానస శర్మ దర్శకత్వం వహించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా రాకాస మూవీని నిర్మించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.

Rakasa Day 10 Expected Box Office Collections Worldwide Sangeeth Shobhan s film good hold on weekend

రాకాస బడ్జెట్ అండ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్‌, ప్రమోషనల్ కార్యక్రమాలతో రాకాస మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. టీజర్, ట్రైలర్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే రాకాస ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాకాస మూవీ థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... ఆంధ్రలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, నైజాంలో 4 కోట్ల రూపాయలు మేర 10 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

రాకాస బ్రేక్ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్ కలిపి 2.5 కోట్ల రేంజ్‌లో అమ్ముడయ్యాయి. మొత్తంగా రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా 12.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నిహారిక కొణిదెల మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్‌ను బ్రేక్ఈవెన్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. రాకాస మూవీని ఆంధ్రా, తెలంగాణలలో 1000 స్క్రీన్లలో, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 250 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 350 స్క్రీన్లలో విడుదల చేశారు.

రాకాస 9 రోజుల కలెక్షన్స్
రాకాస తొలిరోజు 2.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.60 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.12 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.06 కోట్ల రూపాయలు, ఆరో రోజున 65 లక్షల రూపాయలు, ఏడో రోజున 60 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజున 45 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 83 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు 12.98 కోట్ల రూపాయల నెట్.. 15 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది.

8 రోజుల వరకు అందుబాటులో ఉన్న లెక్కలను బట్టి రాకాస మూవీకి నైజాంలో 3.61 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 84 లక్షల రూపాయలు, ఆంధ్రాలో 2.85 లక్షల రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 76 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 19 కోట్ల రూపాయల గ్రాస్.. 11 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.

రాకాస ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 311,777 డాలర్లు (2.90 కోట్ల రూపాయలు), యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే తదితర దేశాలలో 61,777 డాలర్లు (58 లక్షల రూపాయలు) వసూలు చేసింది. దాంతో ఇప్పటి వరకు రాకాస మూవీకి ఓవర్సీస్‌లో 373,554 డాలర్లు ( 3.50 కోట్ల రూపాయలు) వసూలైంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి రాకాసకు ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 19 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది.

రాకాస 10వ రోజు వసూళ్ల అంచనా
వీకెండ్ కావడంతో రాకాసకు మెరుగైన బుకింగ్స్ జరుగుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. శనివారం ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా కోటి రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టి పుంజుకుంది. ఆదివారం కూడా ఇదే స్థాయిలో వసూళ్లను రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. 10వ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు రాకాస మూవీకి ఇండియాలో 320 షోలు ప్రదర్శితమై.. 18 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ నివేదించింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఆదివారం ఈ సినిమాకు 25 లక్షల రూపాయలు వసూలైంది. 10వ రోజున రాకాస మూవీకి తెలుగు రాష్ట్రాలలో కోటి రూపాయలు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి 50 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 1.50 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

రాకాస మూవీ లాభాల్లోకి రావాలంటే 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా దాదాపు 11 కోట్ల రూపాయల రేంజ్‌లో షేర్ రాబట్టింది రాకాస. మరో 2.5 కోట్ల రూపాయల షేర్ రాబడితే ఈ సినిమా క్లీన్ హిట్ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X