Rakasa Day 2 Collections: రాకాసకు డీసెంట్‌ కలెక్షన్స్.. నిహారిక మూవీకి 2వ రోజు ఎన్ని కోట్లంటే?

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం రాకాస. మానస శర్మ దర్శకత్వం వహించగా.. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏప్రిల్ 3న రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రాకాస మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు ఈ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

రాకాస బడ్జెట్ అండ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్‌, ప్రమోషనల్ కార్యక్రమాలతో రాకాస మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. టీజర్, ట్రైలర్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే రాకాస ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాకాస మూవీ థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... ఆంధ్రలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, నైజాంలో 4 కోట్ల రూపాయలు మేర 10 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

Rakasa Day 2 Expected Box Office Collections Worldwide Sangeeth Shobhan s film get Decent Number

రాకాస బ్రేక్ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్ కలిపి 2.5 కోట్ల రేంజ్‌లో అమ్ముడయ్యాయి. మొత్తంగా రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా 12.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నిహారిక కొణిదెల మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్‌ను బ్రేక్ఈవెన్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.

రాకాస తొలిరోజు కలెక్షన్స్
రాకాస మూవీకి తొలిరోజు ఇండియాలో 2.60 కోట్ల రూపాయల నెట్.. 2.99 కోట్ల రూపాయల గ్రాస్ లభించినట్లు సాక్‌నిక్ నివేదించింది. అయితే వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్స్‌తో కలిపి ఈ సినిమాకు 5.6 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైనట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తొలిరోజు ఇండియా వైడ్‌గా 1318 షోలు ప్రదర్శితమై 36 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

రాకాస ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో రాకాసకు మంచి వసూళ్లు లభిస్తున్నాయి. ప్రీమియర్స్‌తో దుమ్మురేపిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు 125K డాలర్లు (భారత కరెన్సీలో 1.16 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. తన దూకుడుతో నార్త్ అమెరికాలో ధురంధర్ 2 తర్వాతి స్థానంలో రాకాస నిలిచింది. యూరప్, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, గల్ఫ్ దేశాలలో వసూళ్లో కలిపి ఓవరాల్‌గా ఓవర్సీస్ నుంచి రాకాస మూవీ 2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

రాకాస రెండో రోజు వసూళ్ల అంచనా
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌కి తోడు చిన్నారుల నుంచి పెద్దల వరకు అలరించే కంటెంట్ ఉండటంతో రాకాసకు అన్ని వర్గాల ఆధరణ లభిస్తోంది. 2వ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు రాకాస మూవీకి ఇండియాలో 657 షోలు ప్రదర్శితమై 24 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ పేర్కొంది. ఇప్పటి వరకు రెండో రోజున రాకాస మూవీకి ఇండియాలో 43 లక్షల రూపాయల నెట్ వచ్చింది. రెండో రోజున రాకాస మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 2.50 కోట్ల రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు చొప్పున 4 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దాంతో రాకాస మూవీ రెండ్రోజుల్లో 10 కోట్ల మార్క్ క్రాస్ చేయొచ్చని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X