Rakasa Day 3 Collections: పుంజుకుంటున్న రాకాస కలెక్షన్స్.. నిహారిక కొణిదెల మూవీకి 3వ రోజు ఎంతంటే?

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన రెండో చిత్రం రాకాస. ఫాంటసీ, హార్రర్, కామెడీ, రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించిన రాకాస చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆదివారంతో ఫస్ట్ వీకెండ్‌ను కంప్లీట్ చేసుకోనుంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో రాకాస మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? మూడో రోజు ఈ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా రాకాస చిత్రాన్ని నిర్మించారు. మానస శర్మ దర్శకత్వం వహించగా.. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏప్రిల్ 3న రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Rakasa Day 3 Expected Box Office Collections Worldwide Niharika Konidela s film heading towards 15 crore mark

రాకాస బడ్జెట్ అండ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్‌, ప్రమోషనల్ కార్యక్రమాలతో రాకాస మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. టీజర్, ట్రైలర్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే రాకాస ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాకాస మూవీ థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... ఆంధ్రలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, నైజాంలో 4 కోట్ల రూపాయలు మేర 10 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

రాకాస బ్రేక్ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్ కలిపి 2.5 కోట్ల రేంజ్‌లో అమ్ముడయ్యాయి. మొత్తంగా రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా 12.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నిహారిక కొణిదెల మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్‌ను బ్రేక్ఈవెన్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.

రాకాస రెండు రోజుల కలెక్షన్స్
రాకాస తొలిరోజు 3.28 కోట్ల రూపాయలు, రెండో రోజున 3.19 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు 5.60 కోట్ల రూపాయల నెట్.. 6.47 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది రాకాస. అయితే రాకాసకు రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 10.30 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు రాకాసకు తెలుగు రాష్ట్రాల్లో 4.25 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 95 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 40 లక్షల రూపాయల చొప్పున వసూలైంది.

రాకాస ఓవర్సీస్ కలెక్షన్స్
ఓవర్సీస్‌లోనూ రాకాసకు మెరుగైన వసూళ్లు వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. శనివారం సంగీత్ శోభన్ మూవీకి నార్త్ అమెరికాలో 62K డాలర్లు (57.66 లక్షల రూపాయలు) వసూలైంది. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో రాకాస మూవీకి 211,777K డాలర్లు (దాదాపు 2 కోట్ల రూపాయలు) రాబట్టింది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలలో 45,777 (42.56 లక్షల రూపాయలు) రాబట్టింది. తద్వారా రాకాస మూవీకి ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 2.43 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

రాకాస మూడో రోజు వసూళ్ల అంచనా
చాలారోజుల తర్వాత కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రావడంతో పాటు పరీక్షల సీజన్ అయిపోవడంతో ఫ్యామిలీలు థియేటర్లకు వస్తున్నాయి. ధురంధర్ 2 మాస్, యాక్షన్ సినిమా కావడంతో మహిళా ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ దక్కడం లేదు. వీరందరికీ రాకాస బెస్ట్ ఛాయిస్‌గా మారింది. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, బళ్లారి, చెన్నై తదితర ప్రాంతాల్లో రాకాసకు మంచి ఆక్యూపెన్సీ కనిపిస్తోంది.

3వ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు రాకాస మూవీకి ఇండియాలో 676 షోలు ప్రదర్శితమై 25 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ పేర్కొంది. ఇప్పటి వరకు మూడో రోజున రాకాస మూవీకి ఇండియాలో 54 లక్షల రూపాయల నెట్ వసూలైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి. మూడో రోజున రాకాస మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు చొప్పున 4 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దాంతో రాకాస మూవీ మూడు రోజుల్లోనే 15 కోట్ల మార్క్ క్రాస్ చేయొచ్చని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X