Rakasa Day 4 Collections: రాకాస వసూళ్ల ఊపు.. సంగీత్ శోభన్ మూవీకి 4వ రోజు ఎన్ని కోట్లంటే?

సంగీత్ శోభన్, నయన సారిక హీరో హీరోయిన్లుగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం రాకాస. మానస శర్మ దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏప్రిల్ 3న రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రాకాస బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజు రాకాస మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

రాకాస బడ్జెట్ అండ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్‌, ప్రమోషనల్ కార్యక్రమాలతో రాకాస మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. టీజర్, ట్రైలర్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే రాకాస ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాకాస మూవీ థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... ఆంధ్రలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, నైజాంలో 4 కోట్ల రూపాయలు మేర 10 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

Rakasa Day 4 Expected Box Office Collections Worldwide Niharika Konidela s film eye on Breakeven target

రాకాస బ్రేక్ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్ కలిపి 2.5 కోట్ల రేంజ్‌లో అమ్ముడయ్యాయి. మొత్తంగా రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా 12.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నిహారిక కొణిదెల మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్‌ను బ్రేక్ఈవెన్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.

రాకాస మూడు రోజుల కలెక్షన్స్
రాకాస తొలిరోజు 2.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.60 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు 8.10 కోట్ల రూపాయల నెట్.. 9.34 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. అయితే తమ చిత్రం 3 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 15.80 కోట్ల రూపాయలు రాబట్టినట్టు రాకాస నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. రాకాసకు ఆంధ్రా+ సీడెడ్‌లో 5 కోట్ల రూపాయలు, తెలంగాణలో 4 కోట్ల రూపాయలు, కర్ణాటకలో కోటి 20 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 35 లక్షల రూపాయలు రాబట్టింది.

రాకాస ఓవర్సీస్ కలెక్షన్స్
ఓవర్సీస్‌లో సంతోష్ శోభన్ మూవీకి ఎన్ఆర్ఐ ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 235,777 డాలర్లు (2.19 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, యూకే, యూరప్ తదితర దేశాలలో 48777 డాలర్లు (45.34 లక్షల రూపాయలు) వసూలైంది. మొత్తంగా మూడు రోజుల వరకు రాకాస మూవీకి ఓవర్సీస్‌లో 2.70 కోట్ల రూపాయలు వచ్చింది.

రాకాస నాలుగో రోజు వసూళ్ల అంచనా
ఐపీఎల్ వంటి మెగా ఈవెంట్ జరుగున్నప్పటికీ .. ఆ ప్రభంజనంలోనూ ఫస్ట్ వీకెండ్ వరకు ఎదురులేకుండా సాగిన రాకాస మూవీకి సోమవారం అగ్నిపరీక్ష ఎదురుకానుంది. వర్కింగ్ డే అయినప్పటికీ వేసవి సెలవుల కారణంగా సినిమాకు మంచి ఆక్యూపెన్సీ నమోదవుతుందని భావిస్తున్నారు. థియేటర్లలో పెద్దగా సినిమాలు లేకపోవడం కూడా రాకాసకు కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు.

4వ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు రాకాస మూవీకి ఇండియాలో 662 షోలు ప్రదర్శితమై 17 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ పేర్కొంది. ఇప్పటి వరకు నాలుగో రోజున రాకాస మూవీకి ఇండియాలో 12 లక్షల రూపాయల నెట్ వసూలైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి. నాలుగో రోజున రాకాస మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 25 లక్షల రూపాయలు చొప్పున 3 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో రాకాస మూవీ నాలుగు రోజుల్లోనే 19 కోట్ల మార్క్ క్రాస్ చేయొచ్చని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X