Rakasa Day 5 Collections: ఆ క్లబ్‌లోకి రాకాస మూవీ.. నిహారిక మూవీకి 5వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన రాకస చిత్రం అన్ని వర్గాల ఆదరణతో మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికే మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ సాధించిన ఈ చిత్రం.. బ్రేక్ఈవెన్ దిశగా వడివడిగా దూసుకెళ్తోంది. నిహారికకు మరో ప్రాఫిట్ వెంచర్‌గా మారనుంది. ఏప్రిల్ 3న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? 5వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టనుంది? ఈ వివరాల్లోకి వెళితే..

సంగీత్ శోభన్, నయన సారిక హీరో హీరోయిన్లుగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా రాకాసను నిర్మించారు. మానస శర్మ దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.

Rakasa Day 5 Expected Box Office Collections Worldwide Niharika Konidela s film get good numbers

రాకాస బడ్జెట్ అండ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్‌, ప్రమోషనల్ కార్యక్రమాలతో రాకాస మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. టీజర్, ట్రైలర్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే రాకాస ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాకాస మూవీ థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... ఆంధ్రలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, నైజాంలో 4 కోట్ల రూపాయలు మేర 10 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

రాకాస బ్రేక్ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్ కలిపి 2.5 కోట్ల రేంజ్‌లో అమ్ముడయ్యాయి. మొత్తంగా రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా 12.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నిహారిక కొణిదెల మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్‌ను బ్రేక్ఈవెన్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.

రాకాస 4 రోజుల కలెక్షన్స్
రాకాస తొలిరోజు 2.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.60 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు 9.26 కోట్ల రూపాయల నెట్.. 10.68 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. అయితే తమ చిత్రం 3 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 15.80 కోట్ల రూపాయలు రాబట్టినట్టు రాకాస నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలో ఈ సినిమాకు 4.52 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 4.27 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.22 కోట్ల రూపాయలు, తమిళనాడు+ రెస్టాఫ్ ఇండియాలో 28 లక్షల రూపాయలు చొప్పున రాబట్టింది.

రాకాస ఓవర్సీస్ కలెక్షన్స్
ఓవర్సీస్‌లో మాత్రం రాకాస మూవీ దుమ్మురేపుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 261,777 డాలర్లు (2.43 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, యూకే, యూరప్ తదితర దేశాలలో 50777 డాలర్లు (47.17 లక్షల రూపాయలు) వసూలైంది. మొత్తంగా మూడు రోజుల వరకు రాకాస మూవీకి ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయలు వచ్చింది.

రాకాస ఐదో రోజు వసూళ్ల అంచనా
సోమవారం వర్కింగ్ డే కావడంతో పాటు ఐపీఎల్ సీజన్ కారణంగా స్వల్పంగా రాకాస వసూళ్లు తగ్గాయి. అయినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో రాకాస ఆక్యూపెన్సీ రాబడుతోంది. 5వ రోజు మధ్యాహ్నం 2 గంట వరకు రాకాస మూవీకి ఇండియాలో 646 షోలు ప్రదర్శితమై 18 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ పేర్కొంది. ఇప్పటి వరకు ఐదో రోజున రాకాస మూవీకి ఇండియాలో 14 లక్షల రూపాయల నెట్ వసూలైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి. మంగళవారం రాకాస మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కోటి 50 లక్షల రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 25 లక్షల రూపాయలు చొప్పున 2 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో రాకాస మూవీ ఐదు రోజుల్లో 20 కోట్ల మార్క్ క్రాస్ చేయొచ్చని భావిస్తున్నారు.

ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి మీద రాకాస మూవీ 56 శాతం రికవరీ సాధించడంతో పాటు 2026లో విడుదలైన తెలుగు సినిమాలలో ఓపెనింగ్ వీకెండ్‌లో మెరుగైన వసూళ్లు రాబట్టిన సినిమాల్లో టాప్ 5లో నిలిచింది. ది రాజాసాబ్ (81.85 కోట్ల రూపాయలు) ముందుండగా.. మన శంకర వరప్రసాద్ గారు (56.05 కోట్ల రూపాయలు), ఉస్తాద్ భగత్ సింగ్ (25.60 కోట్ల రూపాయలు), అనగనగా ఒకరాజు (20.40 కోట్ల రూపాయలు) తర్వాతి స్థానంలో నిలిచాయి. రాకాసకు ఓపెనింగ్ వీకెండ్‌లో వరల్డ్ వైడ్‌గా 15.80 కోట్ల రూపాయలు వసూలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X