Rakasa Day 6 Collections: రవితేజ రికార్డ్‌పై రాకాస కన్ను.. నిహారిక మూవీకి 6 రోజుల్లో కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే

సంగీత్ శోభన్, నయన సారిక జంటగా మానస శర్మ తెరకెక్కించిన లవ్, ఫాంటసీ, కామెడీ, హార్రర్ మూవీ రాకాస. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా రాకాసను నిర్మించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. ఈ నేపథ్యంలో రాకాస మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? 5 రోజుల వరకు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

రాకాస బడ్జెట్ అండ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్‌, ప్రమోషనల్ కార్యక్రమాలతో రాకాస మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. టీజర్, ట్రైలర్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే రాకాస ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాకాస మూవీ థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... ఆంధ్రలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, నైజాంలో 4 కోట్ల రూపాయలు మేర 10 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

Rakasa Day 6 Expected Box Office Collections Worldwide Niharika s film entered into highest grossing telugu movies 2026 list

రాకాస బ్రేక్ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్ కలిపి 2.5 కోట్ల రేంజ్‌లో అమ్ముడయ్యాయి. మొత్తంగా రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా 12.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నిహారిక కొణిదెల మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్‌ను బ్రేక్ఈవెన్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. రాకాస మూవీని ఆంధ్రా, తెలంగాణలలో 1000 స్క్రీన్లలో, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 250 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 350 స్క్రీన్లలో విడుదల చేశారు.

రాకాస 5 రోజుల కలెక్షన్స్
రాకాస తొలిరోజు 2.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.60 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.12 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.06 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు 10.18 కోట్ల రూపాయల నెట్.. 11.73 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. తెలంగాణలో ఈ సినిమాకు 5.23 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 4.68 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.28 కోట్ల రూపాయలు, తమిళనాడు+ రెస్టాఫ్ ఇండియాలో 33 లక్షల రూపాయలు చొప్పున రాబట్టింది.

రాకాస ఓవర్సీస్ కలెక్షన్స్
ధురంధర్ 2 వంటి భారీ చిత్రం ఉన్నప్పటికీ ఓవర్సీస్‌ రాకాస మూవీ ఎదురులేకుండా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 287,777 డాలర్లు (2.66 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, యూకే, యూరప్ తదితర దేశాలలో 52777 డాలర్లు (48.87 లక్షల రూపాయలు) వసూలైంది. మొత్తంగా 5 రోజుల వరకు రాకాస మూవీకి ఓవర్సీస్‌లో 3.30 కోట్ల రూపాయలు వచ్చింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు రాకాసకు వరల్డ్ వైడ్‌గా 15 కోట్ల రూపాయలు వసూలైనట్లు సాక్‌నిక్ తెలిపింది. అయితే నిర్మాతల లెక్కల ప్రకారం రాకాస ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల మార్క్ దాటినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

రాకాస ఆరో రోజు వసూళ్ల అంచనా
వర్కింగ్ డే సమయంలోనూ రాకాస మూవీ నిలకడగా వసూళ్లు రాబడుతున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ప్రతిరోజూ 250 షోలకు తగ్గకుండా ప్రదర్శనలు పడుతున్నాయి. అలాగే నగరంలో 25 శాతం వరకు థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదవుతున్నట్లుగా సాక్‌నిక్ చెబుతోంది. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, విజయవాడ తదితర నగరాల్లోనూ మంచి ఆక్యూపెన్సీ నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. ఐపీఎల్ సీజన్‌లోనూ రోజుకు కోటి రూపాయలు తగ్గకుండా వసూళ్లు రాబడుతోంది.

6వ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు రాకాస మూవీకి ఇండియాలో 630 షోలు ప్రదర్శితమై 18 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ పేర్కొంది. ఇప్పటి వరకు ఆరో రోజున రాకాస మూవీకి ఇండియాలో 15 లక్షల రూపాయల నెట్ వసూలైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి. బుధవారం రాకాస మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కోటి 50 లక్షల రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 25 లక్షల రూపాయలు చొప్పున 2 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఆ లిస్ట్‌‌లో రాకాస
ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి మీద రాకాస మూవీ 60 శాతం రికవరీ సాధించింది. అలాగే 2026లో విడుదలైన తెలుగు సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో రాకాస మూవీ 6వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ లిస్ట్‌లో మన శంకర వరప్రసాద్ గారు (220.99 కోట్ల రూపాయలు), ది రాజాసాబ్ (146.04 కోట్ల రూపాయలు), ఉస్తాద్ భగత్ సింగ్ (71.66 కోట్ల రూపాయలు), అనగనగా ఒక రాజు (53.9 కోట్ల రూపాయలు), నారి నారి నడుమ మురారి (26.27 కోట్ల రూపాయలు), భర్త మహశయులకు విజ్ఞప్తి (17.15 కోట్ల రూపాయలు) ముందున్నాయి. రేపో మాపో రవితేజ మూవీ రికార్డ్‌ను బ్రేక్ చేసి టాప్ 5లో రాకాస చోటు దక్కించుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X