Rakasa Day 7 Collections: రాకాసతో అన్న రికార్డ్‌ బ్రేక్.. సంగీత్ శోభన్ మూవీకి 7వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?

మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన మూవీ రాకాస. ఫ్యామిలీ, లవ్, హార్రర్ కామెడీ, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో మానస శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంగీత్ శోభన్, నయన సారిక జంటగా నటించారు. ఏప్రిల్ 3న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ సినిమా ఇవాళ్టీతో వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో రాకాస మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? 7 రోజుల వరకు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Rakasa Day 6 Collections: రవితేజ రికార్డ్‌పై రాకాస కన్ను.. నిహారిక మూవీకి 6 రోజుల్లో కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే
Rakasa Day 6 Collections: రవితేజ రికార్డ్‌పై రాకాస కన్ను.. నిహారిక మూవీకి 6 రోజుల్లో కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా రాకాసను నిర్మించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.

Rakasa Day 7 Expected Box Office Collections Worldwide Sangeeth Shobhan s Film Beat Couple Friendly Net Collection

రాకాస బడ్జెట్ అండ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్‌, ప్రమోషనల్ కార్యక్రమాలతో రాకాస మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. టీజర్, ట్రైలర్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే రాకాస ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాకాస మూవీ థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... ఆంధ్రలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, నైజాంలో 4 కోట్ల రూపాయలు మేర 10 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

Recommended For You
Samantha: అక్కినేని ఫ్యామిలీకి అండగా సమంత.. డైవోర్స్‌ తర్వాత అన్ని మరిచిపోయి!
Samantha: అక్కినేని ఫ్యామిలీకి అండగా సమంత.. డైవోర్స్‌ తర్వాత అన్ని మరిచిపోయి!

రాకాస బ్రేక్ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్ కలిపి 2.5 కోట్ల రేంజ్‌లో అమ్ముడయ్యాయి. మొత్తంగా రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా 12.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నిహారిక కొణిదెల మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్‌ను బ్రేక్ఈవెన్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. రాకాస మూవీని ఆంధ్రా, తెలంగాణలలో 1000 స్క్రీన్లలో, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 250 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 350 స్క్రీన్లలో విడుదల చేశారు.

You May Also Like
Dacoit Advance Booking: ఓవర్సీస్‌లో డెకాయిట్ అడ్వాన్స్ బుకింగ్ .. అడివి శేష్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Dacoit Advance Booking: ఓవర్సీస్‌లో డెకాయిట్ అడ్వాన్స్ బుకింగ్ .. అడివి శేష్ మూవీకి ఎన్ని కోట్లంటే?

రాకాస 6 రోజుల కలెక్షన్స్
రాకాస తొలిరోజు 2.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.60 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.12 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.06 కోట్ల రూపాయలు, ఆరో రోజున 65 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు 10.90 కోట్ల రూపాయల నెట్.. 12.56 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. 6 రోజుల వరకు నైజాంలో 3.20 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 2.45 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 75 లక్షల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 12 కోట్ల రూపాయల గ్రాస్.. 6.40 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. 6 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో 10.83 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.27 కోట్ల రూపాయలు, తమిళనాడులో 25 లక్షల రూపాలు, రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయల నెట్ వసూలు చేసింది రాకాస మూవీ.

Race Gurram Re Release Day 1 Collections: రీ రిలీజ్‌లో రేసుగుర్రం హవా.. అల్లు అర్జున్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Race Gurram Re Release Day 1 Collections: రీ రిలీజ్‌లో రేసుగుర్రం హవా.. అల్లు అర్జున్ మూవీకి ఎన్ని కోట్లంటే?

రాకాస ఓవర్సీస్ కలెక్షన్స్
ధురంధర్ 2 వంటి భారీ చిత్రం ఉన్నప్పటికీ ఓవర్సీస్‌ రాకాస మూవీ ఎదురులేకుండా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 300K డాలర్లు (2.78 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, యూకే, యూరప్ తదితర దేశాలలో 50 లక్షల రూపాయలు వసూలైంది. మొత్తంగా 5 రోజుల వరకు రాకాస మూవీకి ఓవర్సీస్‌లో 3.50 కోట్ల రూపాయలు వచ్చింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు రాకాసకు వరల్డ్ వైడ్‌గా 16 కోట్ల రూపాయలు వసూలైనట్లు సాక్‌నిక్ తెలిపింది.

మృణాల్ ఠాకూర్‌కు అక్కినేని హీరో క్షమాపణ.. తప్పు చేశానంటూ..
మృణాల్ ఠాకూర్‌కు అక్కినేని హీరో క్షమాపణ.. తప్పు చేశానంటూ..

రాకాస 7వ రోజు వసూళ్ల అంచనా
ఇప్పటి వరకు రోజుకు కోటి రూపాయలు తగ్గకుండా వసూలు చేసిన రాకాస మూవీకి ఆరో రోజున కలెక్షన్స్ తగ్గాయి. నిన్న ఇండియాలో కేవలం 65 లక్షల రూపాయల నెట్ మాత్రమే రాబట్టగలిగింది ఈ చిత్రం. శుక్రవారం నుంచి కొత్త సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో రాకాస వసూళ్లపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. 7వ రోజున మధ్యాహ్నం 2 గంటల వరకు రాకాస మూవీకి ఇండియాలో 601 షోలు ప్రదర్శితమై.. 17 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ నివేదించింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. గురువారం ఈ సినిమాకు 7 లక్షల రూపాయల వసూలైంది. 7వ రోజున రాకాస మూవీకి తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి కోటి రూపాయలు వస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Dhurandhar 2 vs Baahubali 2: ధురంధర్ 2 బాక్సాఫీస్ జైత్రయాత్ర.. డేంజర్‌ జోన్‌లో బాహుబలి 2 రికార్డ్‌!
Dhurandhar 2 vs Baahubali 2: ధురంధర్ 2 బాక్సాఫీస్ జైత్రయాత్ర.. డేంజర్‌ జోన్‌లో బాహుబలి 2 రికార్డ్‌!

రాకాస మూవీ ఇప్పటి వరకు బడ్జెట్ మీద 73 శాతం రివకరీ సాధించింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా దాదాపు 8.5 కోట్ల రూపాయల రేంజ్‌లో షేర్ రాబట్టింది రాకాస. మరో 5 కోట్ల రూపాయల షేర్ రాబడితే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది. మరోవైపు.. 2026లో రిలీజైన తెలుగు సినిమాల నెట్ కలెక్షన్స్ లిస్ట్‌లో తన అన్నయ్య సంతోష్ శోభన్ నటించిన కపుల్ ఫ్రెండ్లీ (10.74 కోట్ల రూపాయలు) నికర వసూళ్లను సంగీత్ శోభన్ తన రాకాస చిత్రంతో(10.83 కోట్ల రూపాయలు) అధిగమించాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ 220.99 కోట్ల రూపాయల నికర వసూళ్లతో ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X