Rakasa Day 8 Collections: నిలకడగా రాకాస కలెక్షన్స్.. నిహారిక కొణిదెల మూవీకి 8వ రోజు ఎంతంటే?

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించగా.. మానస శర్మ దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. ఏప్రిల్ 3న విడుదలైన ఈ సినిమా వారం రోజుల థియేట్రికల్ జర్నీని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో రాకాస మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? వారం రోజుల్లో ఈ మూవీ ఎంత రాబట్టింది? 8వ రోజు వసూళ్లు ఎంత? ఈ వివరాల్లోకి వెళితే..

రాకాస బడ్జెట్ అండ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్‌, ప్రమోషనల్ కార్యక్రమాలతో రాకాస మూవీకి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. టీజర్, ట్రైలర్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే రాకాస ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాకాస మూవీ థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... ఆంధ్రలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, నైజాంలో 4 కోట్ల రూపాయలు మేర 10 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

Rakasa Day 8 Expected Box Office Collections Worldwide Sangeeth Shobhan s Film maintaining a steady momentum

రాకాస బ్రేక్ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్ కలిపి 2.5 కోట్ల రేంజ్‌లో అమ్ముడయ్యాయి. మొత్తంగా రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా 12.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నిహారిక కొణిదెల మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్‌ను బ్రేక్ఈవెన్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. రాకాస మూవీని ఆంధ్రా, తెలంగాణలలో 1000 స్క్రీన్లలో, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 250 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 350 స్క్రీన్లలో విడుదల చేశారు.

రాకాస 7 రోజుల కలెక్షన్స్
రాకాస తొలిరోజు 2.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.60 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.12 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.06 కోట్ల రూపాయలు, ఆరో రోజున 65 లక్షల రూపాయలు, ఏడో రోజున 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు 11.47 కోట్ల రూపాయల నెట్.. 13.22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. ఇప్పటి వరకు తెలంగాణలో 6.05 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 6.38 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.20 కోట్ల రూపాయలు, తమిళనాడులో 18 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 14 లక్షల రూపాయలు చొప్పున గ్రాస్ వసూలు చేసింది.

రాకాస ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 300K డాలర్లు (2.78 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, యూకే, యూరప్ తదితర దేశాలలో కలిపి ఓవర్సీస్‌లో 410K డాలర్లు (3.82 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు రాకాసకు వరల్డ్ వైడ్‌గా 18 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

రాకాస 8వ రోజు వసూళ్ల అంచనా
శుక్రవారం డెకాయిట్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తదితర చిన్నా పెద్దా సినిమాలు రిలీజ్ కానుండటంతో పాటు ధురంధర్ 2, ఐపీఎల్ ప్రభావం రాకాస మూవీ బుకింగ్స్‌పై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీకెండ్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి నిహారిక కొణిదెల మూవీకి ఆదరణ లభించవచ్చని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

8వ రోజు బుకింగ్స్‌లో భారీ తగ్గుదల కనిపించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు రాకాస మూవీకి ఇండియాలో 261 షోలు ప్రదర్శితమై.. 15 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ నివేదించింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. గురువారం ఈ సినిమాకు 4 లక్షల రూపాయల వసూలైంది. 8వ రోజున రాకాస మూవీకి తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి కోటి రూపాయలు వస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

రాకాస మూవీ లాభాల్లోకి రావాలంటే 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా దాదాపు 9 కోట్ల రూపాయల రేంజ్‌లో షేర్ రాబట్టింది రాకాస. మరో 4.5 కోట్ల రూపాయల షేర్ రాబడితే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది. ఈ వీకెండ్ తర్వాత రాకాస థియేట్రికల్ రన్‌పై క్లారిటీ రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X