Rakasa Business: రాకాస సినిమా రికార్డు బిజినెస్ .. రిలీజ్‌కు ముందే భారీ లాభాలతో నిహారిక కొణిదెల

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియో బ్యానర్‌పై రూపొందిన చిత్రం రాకాస. కామెడీ, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యువ హీరో సంగీత్ శోభన్, సక్సెస్‌ఫుల్ హీరోయిన్ నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాకు రచనా సహకారంతోపాటు మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశీష్ విద్యార్థి, గెటప్ శ్రీను, వాసూ ఇంటూరి, రోహిణి తదితరులు నటించారు.

ఈ చిత్రం సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. రాజు ఎదురోలు సినిమాటోగ్రఫి అన్వర్ అలీ ఎడిటర్‌గా, అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఉమేష్ కుమార్ భన్సల్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న ఫ్యాన్సీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ 'రాకాస‌'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌కు భారీ రెస్పాన్స్ రావడం, టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు పెరగడంతో బిజినెస్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. దాంతో ఈ మూవీ భారీ బిజినెస్ పూర్తి చేసుకొంటున్నది. ఈ సినిమా బిజినెస్ వివరాల్లోకి వెళితే..

Rakasa Movie Theatrical Business Worldwide

హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన రాకాస చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో రెస్పాన్స్ సూప‌ర్బ్‌గా ఉంది. ఇటీవ‌లే విడుద‌లైన మూవీ టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే 1.9 మిలియన్ వ్యూస్‌ను రాబ‌ట్టుకోగా, టీజర్ 2.8 మిలియన్ వ్యూస్ దాటి ఆన్‌లైన్‌లో ఆడియెన్స్‌ను నుంచి మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంటోంది. పాటల విషయానికి వ‌స్తే.. ఈ మూవీ మొదటి పాట 'ర‌ప‌ప్పా' ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్‌లో 1.1 మిలియన్ వ్యూస్ దాటింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కు ఫ్యాన్సీ రేటు పలికింది. ట్రేడ్ సర్కిల్స్‌లో ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు 10 కోట్ల రూపాయలు చెల్లించి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ దక్కించుకొన్నది. ఇక ఈ సినిమా మ్యూజికల్ రైట్స్ మంచి ధరను ఆఫర్ చేసి సారేగమ హక్కులను సొంతం చేసుకొన్నది. దాంతో ఆ ప్రభావం థియేట్రికల్ రిలీజ్‌పై కూడా పడింది.

ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ సొంతం చేసుకొన్నారు. ఈ సినిమాను ఓవర్సీస్‌లో భారీగా రిలీజ్‌కు ప్రత్యాంగీరా సినిమాస్ ప్లాన్ చేస్తున్నారు. నార్త్ అమెరికా, యూకే, ఐర్లాండ్, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో సుమారుగా 350 స్క్రీన్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ సిద్దం చేశారు. ఏప్రిల్ 2వ తేదీన పెయిడ్ ప్రీమియర్లను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఆంధ్రా, నైజాం, సీడెడ్ ప్రాంతాల హక్కులను సుమారుగా 12 కోట్ల రూపాయల ధర పలికింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక, ఇతర ప్రాంతాల రైట్స్ వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఈ సినిమా బిజినెస్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాత నిహారిక కొణిదెల బిజినెస్ స్ట్రాటజీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X