Rakasa Vs Biker Box Office: బాక్సాఫీస్ రేసులో బైకర్ బ్యాడ్ స్టార్ట్.. రాకాస కలెక్షన్ల పరిస్థితి ఏమిటంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం వారంలో బైకర్, రాకాస సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. శర్వానంద్ నటించిన ఓ సినిమా ఒకవైపు, నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కిన మరో వైపు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నాయి. అయితే ఈ చిత్రాల ఇండియన్, ఓవర్సీస్‌లో ఎలాంటి స్పందన సొంతం చేసుకొంటున్నాయి. బాక్సాఫీస్ వద్ద వాటి పరిస్థితి ఏమిటి? అయితే మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబడుతున్నాయా? అనే వివరాల్లోకి వెళితే..
స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కిన బైకర్ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయగా, నార్త్ అమెరికాలో శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాను అట్టహాసంగా ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా ప్రీమియర్లకు పెద్దగా స్పందన కనిపించలేదు. అలాగే తొలి రోజు కూడా అంతంతా మాత్రంగానే వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

బైకర్ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల మద్దతు లభించలేదనే విషయం తాజాగా నమోదైన కలెక్షన్లతో స్పష్టమైంది. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 31K డాలర్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు, 50K డాలర్లు రాబట్టిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక తొలి రోజు కూడా పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ సినిమా శుక్రవారం మరో 31K కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ అనలిస్ట్ వెంకీ బాక్సాఫీస్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.
ఇక ఇదే వారం రిలీజైన రాకాస చిత్రం ఈ వారం బాక్సాఫీస్ వద్ద జోరును చూపించే ప్రయత్నం చేస్తున్నది. ఈ సినిమాను ప్రత్యాంగీరా సినిమాస్ భారీగా రిలీజ్ చేసింది. సుమారుగా 255 లొకేషన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది. ప్రీమియర్లు, శుక్రవారం కలెక్షన్లు కలిపి సుమారుగా 125K డాలర్లు వసూలు చేసింది అని ప్రత్యాంగీరా సినిమాస్ అధికారికంగా ప్రకటించింది.
ఇక బైకర్ సినిమా ఇండియాలో నమోదు చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. 40 శాతం అక్యుపెన్సీతో ఈ సినిమా తొలి రోజు 2.10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగులో 2.05 కోట్ల రూపాయలు, తమిళంలో 5 లక్షల రూపాయలను రాబట్టిందని సాక్ నిక్ వెల్లడించింది.
రాకాస సినిమా ఇండియా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక డే 1 విషయానికి వస్తే.. ఈ మూవీ 2.6 కోట్ల రూపాయలను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం తొలి రోజు ముగిసే సమయానికి ఇండియాలో 3 కోట్ల రూపాయలు, నార్త్ అమెరికాలో 90 లక్షల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











