twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోసం, 150 కోట్ల నష్టం: హృతిక్ తండ్రి ఆరోపణ షారుక్‌ను ఉద్దేశించేనా?

    హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ పరోక్షంగా షారుక్ ను ఉద్దేశించి చీటింగ్ ఆరోపణలు చేయడం చర్చనీయాంశం అయింది

    By Bojja Kumar
    |

    ముంబై: షారుక్ ఖాన్ నటించిన 'రయీస్' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని సూపర్ కలెక్షన్లతో దూసుకెలుతున్న తరుణంలో 'కాబిల్' చిత్ర నిర్మాత, హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ పరోక్షంగా షారుక్ ను ఉద్దేశించి చీటింగ్ ఆరోపణలు చేయడం చర్చనీయాంశం అయింది.

    'రయీస్', 'కాబిల్' చిత్రాలు ఒకే రోజు విడుదల కావడంతో థియేటర్ల సమస్య ఏర్పడింది. ఇద్దరూ బడా నిర్మాతలే కావడంతో.... వీలైనన్ని ఎక్కువ థియేటర్లు దక్కించుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నించారు. ఇద్దరి ఒత్తిడి భరించలేక 50:50 నిష్పత్తిలో థియేటర్లు కేటాయిస్తామని ఒప్పుకున్నారు.

    అయితే చివరకు షారుక్ మేనేజ్ చేసి 60శాతం థియేటర్లు 'రయీస్' చిత్రానికి వచ్చేలా పావులు కదిపారట. దీంతో 'కాబిల్' చిత్రానికి 40 శాతం మాత్రమే థియేటర్లు దక్కాయి. దీంతో రాకేష్ రోషన్ మీడియా ముందుకొచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లబోసుకున్నారు. నేరుగా షారుక్ ఖాన్ పేరు ప్రస్తావించకుండా.... కొందరు పవర్ ఫుల్ పీపుల్ తమ పవర్ ను దుర్వినియోగం చేసారు. మోస పూరితంగా వ్యవహరించారు. ఇది ఇలానే కంటిన్యూ అయితే నేను సినిమాలు చేయడం మానేస్తాను అని రాకేష్ రోషన్ అన్నారు.

     ఇలా మోసం చేసాడట

    ఇలా మోసం చేసాడట

    50:50 థియేటర్లు తీసుకోవాలని మొదట ఒప్పందానికి వచ్చాము. ఇది దేశవిదేశాల్లోని థియేటర్లకు వర్తిస్తుంది. అయితే దీనికి విరుద్ధంగా ఎగ్జిబిటర్లను మేనేజ్ చేసి 60:40 శాతం ధియేటర్లను కేటాయించేలా చేశారని ఆరోపించారు.

     రూ. 150 కోట్ల నష్టం

    రూ. 150 కోట్ల నష్టం

    'రయీస్' కంటే 'కాబిల్' తక్కువ ధియేటర్లలో విడుదలైందని, తమకు థియేటర్లు తక్కువగా కేటలాయించడం వల్ల 150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని రాకేష్ రోషన్ అన్నారు. దేవుడు అనే వాడు ఉన్నాడని... అన్నీ అతడే చూసుకుంటాడని తెలిపారు.

     ఎప్పుడో విడుదల కావాల్సింది

    ఎప్పుడో విడుదల కావాల్సింది

    రంజాన్ సమయంలో 'రయీస్' సినిమా విడుదల కావాల్సి ఉంది. అపుడు 'సుల్తాన్' కారణంగా వాయిదా వేశారు. తర్వాత పరిస్థితులు అనుకూలించ పోవడంతో జనవరి 25న డేట్ ఫిక్స్ చేసారు. అయితే 'కాబిల్' ముందుగా నిర్ణయించిన డేట్ ప్రకారమే ఈ రోజు విడుదలైంది.

     రయీస్ రివ్యూ

    రయీస్ రివ్యూ

    అభిమానులను మత్తులో ముంచిన షారుక్ (రయీస్ మూవీ పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేయండి)

    English summary
    Raees has been given 60 percent screens thereby leaving Kaabil with 40 percent. On this Rakesh Roshan is extremely hurt and upset.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X