‘రాక్షసుడు’ హిట్ టాక్... ఫస్ట్ డే కలెక్షన్ ఎంతంటే?
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'రాక్షసుడు' జులై 2న విడుదలై బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఏ స్టూడియోస్ బ్యానర్‌పై హవీశ్ ప్రొడక్షన్‌లో రమేశ్ వర్మ దర్శకుడిగా రూపొందిన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ సాధారణంగా ఉన్నప్పటికీ పాజిటివ్ టాక్‌తో ఫస్ట్ వీకెండ్ వసూళ్లు అదిరిపోవడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తొలి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.90 కోట్ల షేర్ వసూలు చేసినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం షోలు పూర్తయ్యాక డిసెంట్ టాక్ స్ప్రెడ్ కావడంతో ఈ వినింగ్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

నైజాంలో రూ. 63 లక్షలు, సీడెడ్ ఏరియాలో రూ. 30 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 34 లక్షలు, ఈస్ట్ గోదావరి 14 లక్షలు, కృష్ణ రూ. 13 లక్షలు, గుంటూరు రూ. 23 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 13 లక్షలు రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ రూ. 12.30 కోట్లకు అమ్మారు. తొలి రోజు రూ. 2 కోట్ల వరకు షేర్ రావడం, పాజిటివ్ మౌత్ టాక్ ఉండటంతో ట్రేడ్ వర్గాలు సైతం నమ్మకంగా ఉన్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రచన: సాగర్, ఆర్ట్: గాంధీ నడికొడికర్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్, నిర్మాత: సత్యనారాయణ కొనేరు, దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స.


Click it and Unblock the Notifications











