Sapta Sagaralu Dhaati Collectionsరక్షిత్ శెట్టి మూవీకి పాజిటివ్ బజ్..బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
సింపుల్ స్టార్ రక్షిత్ శెట్టి నిర్మాతగా మారడమే కాకుండా నటించిన చిత్రం సప్త సాగరాలు దాటి సైడ్ ఏ సినిమా సెప్టెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఏ సినిమా కన్నడలో భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ దూసుకెళ్తున్న నేపథ్యంలో తెలుగులోకి డబ్బింగ్ చేసి సప్త సాగరాలు దాటి సైడ్ ఏ అనే పేరుతో రిలీజ్ చేశారు. హేమంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో బాక్సాఫీస్ వద్ద పరిస్థితి ఏమిటంటే?
సప్త సాగర దాచే ఎల్లో సైడ్ ఏ చిత్రాన్ని రక్షిత్ శెట్టి సుమారు 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను కేవలం కర్ణాటకలో మాత్రమే రిలీజ్ చేశారు. దాదాపు 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. రెండు వారాల తర్వాత ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చిత్రంగా విడుదల చేశారు.

సప్త సాగర దాచే ఎల్లో Side A మూవీకి హిట్ టాక్ తొలి రోజు నుంచే భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా కర్ణాటకలో తొలి రోజు 2 కోట్లు, రెండో రోజు 2.5 కోట్లు, మూడో రోజు 3.5 కోట్ల రూపాయలు రాబట్టింది. తొలివారం ముగిసే సమయానికి ఈ సినిమా 12 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఇక రెండో వారం ఈ సినిమా 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా రెండు వారాల్లో 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక తెలుగులో విడుదలైన సప్త సాగరాలు దాటి మూవీ ప్రమోషన్స్ భారీగా చేయడంతో మంచి క్రేజ్ లభించింది. కన్నడ వెర్షన్ సినిమా చూసిన తెలుగు అభిమానులు ఈ సినిమాపై పాజిటివ్‌గా సోషల్ మీడియాలో స్పందించారు. దాంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. దాంతో కొంత అడ్వాన్స్ బుకింగ్‌లో రెస్పాన్స్ లభించినా.. కరెంట్ బుకింగ్‌కు మంచి స్పందన లభించింది.

సప్త సాగర దాచే ఎల్లో సైడ్ ఏ మూవీకి డబ్బింగ్‌గా వచ్చిన పప్తసగరాలు దాటి సినిమా పాజిటివ్ రెస్పాన్స్ కనిపించింది. ఈ సినిమాకు ఏ సెంటర్లలో సానుకూలమైన టాక్ వినిపించింది. దాంతో ఫస్ట్, సెకండ్ షోలకు బుకింగ్, ఆక్యుపెన్సీ పెరిగింది. దాంతో ఈ సినిమా తొలి రోజు తెలుగు బాక్సాఫీస్ వద్ద 1 కోటి రూపాయల షేర్ వసూలు చేసే అవకాశం ఉంది. అయితే వీకెండ్‌లో ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











