Sapta Sagaradaache Ello Side A collections రక్షిత్ శెట్టి మూవీ రికార్డు ఓపెనింగ్స్..ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి హీరోగా, యువ హీరోయిన్ రుక్మిణి వసంత్ జంటగా నటించిన తాజా చిత్రం సప్త సాగరదాచే ఎల్లో (సైడ్ A) చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన రిలీజై పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు చరణ్ రాజ్ సంగీతం అందించగా, అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫిని అందించారు. హీరో రక్షిత్ శెట్టి, పుష్కర మల్లీకార్జునయ్య నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను సాధిస్తుందనే వివరాల్లోకి వెళితే..

సప్త సాగరదాచే ఎల్లో (సైడ్ A) మూవీ బడ్జెట్, స్క్రీన్ కౌంట్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాను భారీ వ్యయంతో తెరకెక్కించారు. ఈ సినిమా కోసం సుమారు 20 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఖర్చు చేశారు. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లకు అనూహ్యమైన రెస్సాన్స్ రావడంతో భారీ బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

Rakshith Shettys Sapta Sagaradaache Ello Side A collections worldwide

సప్త సాగరదాచే ఎల్లో (సైడ్ A) మూవీ రిలీజ్ విషయానికి వస్తే.. కన్నడలో భారీ క్రేజ్ పెరగడంతో రికార్డు స్థాయిలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను కన్నడలో 4000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ఇండియా వైడ్ ఈ సినిమాను 5600 స్క్రీన్లకుపైగా విడుదల చేశారు.

సప్త సాగరదాచే ఎల్లో (సైడ్ A) మూవీ కథ విషయానికి వస్తే.. ప్రముఖ వ్యాపారవేత్తకు కారు డ్రైవర్‌గా పనిచేసే మను (రక్షిత్ శెట్టి), గాయని ప్రియ (రుక్మిణి వసంత్) మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు. వారిద్దరికి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలనే కోరిక ఉంటుంది. మను, ప్రియ ప్రేమించుకొంటుంటారు. ప్రియ సింగర్‌గా రాణించేందుకు కర్ణాటకలోని తీర ప్రాంతం నుంచి బెంగళూరుకు చేరుకొంటుంది. అనుకోకుండా మను జైలుకు వెళ్లడంతో పరిస్థితి తారుమారవుతుంది. దాంతో వారి ప్రేమ వ్యవహారం గందరగోళానికి గురవుతుంది. ఈ క్రమంలో వారి జీవితాల్లో చోటు చేసుకొన్న చేదు సంఘటనలు ఏమిటనేది ఈ సినిమా కథ.

Rakshith Shettys Sapta Sagaradaache Ello Side A collections worldwide

సప్త సాగరదాచే ఎల్లో (సైడ్ A) సినిమాకు తొలి ఆట నుంచే హిట్ టాక్ వినిపిస్తున్నది. సగటు ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాపై, దర్శకుడి టేకింగ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రక్షిత్ శెట్టి కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్ల ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచాయి.

Rakshith Shettys Sapta Sagaradaache Ello Side A collections worldwide

సప్త సాగరదాచే ఎల్లో (సైడ్ A) తొలి రోజు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా కన్నడ రాష్ట్రంలో తొలి రోజు 2 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. రెండో రోజు కలెక్షన్లు పెరగడంతోపాటు 2.55 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 21 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X