twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బృందావనం' కలెక్షన్ పై 'రక్త చరిత్ర' ఎఫెక్టు (ట్రేడ్ టాక్)

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం "రక్త చరిత్ర" భారీ ఓపినింగ్స్ తో ఓ స్టార్ హీరో చిత్రంలా రిలీజైంది. రిలీజైన రోజే ఎన్టీఆర్ ని సరిగా చూపలేదంటూ, అవమానపరిచారంటూ రకరకాల కాంట్రావర్శీలు చుట్టిముట్టాయి. ఏ ఛానెల్ తిప్పినా రక్త చరిత్ర హవానే నడిచింది. దాంతో మరింతగా జనాల్లో ఆసక్తి పెరిగింది. మరో ప్రక్క చూసిన జనం ఎవరూ నెగిటివ్ గా చెప్పక పోవటం ఈ చిత్రానికి మరో ప్లస్ గా మారింది. సినిమాలో హింస ఉన్నా ప్యామిలీలకు అది దూరమైనా ప్రస్తుతం కలెక్షన్స్ కు మాత్రం అది లోటు రానివ్వటం లేదు. విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా రూపాయికి రూపాయి వస్తుందని భావిస్తున్నట్లు ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

    ఇక ఈ చిత్రం ఎఫెక్టు ఎన్టీఆర్ తాజా చిత్రం "బృందావనం" పై పడిందంటున్నారు. వీకెండ్ ల కలెక్షన్స్ ని రక్త చరిత్ర కొట్టుకెళ్ళిపోయిందని చెప్తున్నారు. మరో ప్రక్క ఎన్టీఆర్ కొత్త చిత్రం అభిమానులు, దిల్ రాజు నిర్మాత అని ఫ్యామిలీలు ఈ చిత్రానికి ఎట్రాక్ట్ అవుతున్నా కలెక్షన్స్ మెల్లిగా డ్రాప్ అవటం నిరాసపరిచే అంశం. దానకి కారణం తెలిసిన కథనే తెలిసిన రీతిలో చెప్పడమేనంటున్నారు. ఇక అప్పటికీ దిల్ రాజు ఈ సినిమానూ తన శాయశక్తులా ప్రమోట్ చేస్తున్నారు. తన ధియోటర్స్ లో పక్కాగా హండ్రెడ్ డేస్ వేస్తానని చెప్తున్నారు.

    దీనికి తోడు రజనీ రోబో మళ్ళీ విజృభించటం ప్రారంభించింది. దసరా రోజు నుంచి ఈ చిత్రం ధియోటర్స్ పెంచారు. ఈ వీకెండ్ లో దాదాపు అన్ని రోబో ధియోటర్స్ లోనూ హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. పిల్లలను ఎట్రాక్ట్ చేసే అంశాలు ఉండటంతో ఫ్యామిలీలు ఈ చిత్రానికి ఎగబడుతున్నట్లు చెప్తున్నారు. చివరగా ఖలేజా మొదట యావరేజ్ అన్నా చివరకు దాన్ని కొమురం పులి ప్రక్కన నిలబెట్టి ప్లాఫ్ అనేసారు. మల్లికా షెరావత్ తాజా చిత్రం ఇంపాక్ట్ ఎక్కడా కనపడలేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X