Don't Miss!
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర' బడ్జెట్, లాభం ఎంతంటే
రామ్ గోపాల్ వర్మ..."రక్త చరిత్ర" చిత్రంతో తిరిగి ఫామ్ లోకి వచ్చేసారు. ఆయన తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రెండు పార్టులుగా రూపొందించిన ఈ చిత్రం దాదాపు యాభై కోట్ల వరకూ బిజెనెస్ చేసిందని విశ్వసనీయ సమాచారం. కేవలం ఇరవై రెండు కోట్ల రూపాయల వ్యయంతో చుట్టిన ఈ చిత్రం పెట్టుబడి శాటిలైట్ రూపంలోనే రికవరి అయినట్లుగా ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దాంతో వచ్చిన రూపాయి అంతా లాభంగానే లెక్క వేస్తున్నారు. తమిళంలో సూర్య హీరోగా ప్రాజెక్టు చేస్తూ స్ట్రైయిట్ చిత్రంగా ఒకే వెర్షన్ గా రిలీజ్ చేస్తూండటంతో మరింత క్రేజ్ వచ్చి విపరీతమైన రేట్లకు అమ్ముడుపోయింది. ఇక రక్త చరిత్ర పార్ట్ వన్ ఇఫ్పటికే రిలీజ్ అయి అందరి డిస్ట్రిబ్యూటర్స్ కూ, ఎగ్జిబిటర్స్ కు లాభాలు తెచ్చిపెట్టడంతో వారంతా రెండవ పార్ట్ వైపు ఆసక్తిగా, ఆశగా చూస్తున్నారు. వారంతా దటీజ్ వర్మ అంటున్నారు. వాస్తవానికి నిన్నటిదాకా వీరంతా ప్లాపుల వర్మ అని తిట్టిన వారే కావటం విశేషం.