'రక్త చరిత్ర' తెలుగు వెర్షన్ ఎంతకు అమ్ముడయిందంటే...
రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'రక్త చరిత్ర' చిత్రం తెలుగు వెర్షన్ రైట్స్ పన్నెండు కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రం రైట్స్ ని..శాటిలైట్ రైట్స్ తో ఈ మొత్తానికి తీసుకున్నట్లు సమాచారం. అలాగే విడివిడిగా కోస్టల్ ఏరియాకు నాలుగున్నర కోట్లకు, రాయలసీమకు మూడు కోట్లకు, నైజాం మూడున్నర, గుంటూరు, కృష్ణా, నెల్లూరు రైట్స్ ని హరి పిక్చర్స్ వారు తీసుకున్నారు. ఈ లెక్కప్రకారం సి.కళ్యాణ్ కు టేబుల్ ప్రాఫిట్ రెండు కోట్లు అని చెప్తున్నారు. ఇక సి.కళ్యాణ్ ప్రస్తుతం దాసరి,బాలకృష్ణ కాంబినేషన్లో పరమ వీర చక్ర చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. అలాగే రక్త చరిత్ర సినిమాకి పరిటాల రవి, సూరిలపై జనాల్లో ఉన్న ఆసక్తితో మంచి క్రేజ్ వచ్చి ఓపినింగ్స్ విపరీతంగా వస్తాయని భావిస్తున్నారు. దీనికి తోడు రామ్ గోపాల్ వర్మ అనే లేబుల్ ఉండనే ఉంది. ఇక ఈ చిత్రం ఆగస్టు 12 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











