రక్తచరిత్ర లాగే రక్తచరిత్ర2 కూడా బాక్స్ ఆఫీసు బొనంజా...!
దసరా సీజన్ బాక్సాఫీస్ కాసులతో గళ గళలాడింది. ప్రేక్షకుల ముందకొచ్చిన పలు చిత్రాలు నాలుగు వారాలపాటు నిలిచి ఇటు నిర్మాతకు, అటు డిస్ట్రిబ్యూటర్ కు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. అంతేగాక విదేశాల్లోనూ ప్రసార హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు దక్కాయి. రోబో, ఖలేజా, బృందావనం, రక్తచరిత్ర విదేశాల్లో మంచి స్పందనను రాబట్టుకున్నాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. విడుదలైన తొలివారంలోనే రోబో ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లు వసూలు చేసింది. ఇటు ఇంటా, అటు బయటా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న చిత్రం 'బృందావనం'. ఎంటర్ టైన్ మెంట్ ఈ చిత్రాన్ని నిలబెట్టింది. హింసా, అశ్లీలత ఏ మాత్రమూ లేకపోవడం 'బృందావనం'కు ప్లస్ పాయింట్. విదేశాల్లోనూ తెలుగువారు చాలామంది చిత్రాన్ని తిలకించారు. విచిత్రమేమంటే...అదే హింసా, రక్తపాతం, అశ్లీలత తగుపాళ్లలో ఉన్న 'రక్తచరిత్ర' విదేశాల్లో అత్యధిక కలెక్షన్స్‌ను రాబట్టుకోవటం. తొలి ఐదు రోజుల్లో రూ.కోటికిపైగా వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. రాష్ట్రంలో ఐదురోజుల్లో 5.14 కోట్ల రూపాయలు రాబట్టింది.
రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర బాక్స్ ఆఫీసు దగ్గర బాగానే సందడి చేస్తుంది, ముఖ్యంగా తెలుగులో రికార్డుల చరిత్ర సృష్టిస్తుంది. సినిమా గురించి మంచి రిపొర్ట్ లు రావడంతో విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి కలక్షన్లను రాబడుతుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్నా, వివాదాల కారణంగా ట్రేడ్ వర్గాలు అనుమానాలు వ్యక్తపరిచాయి. కానీ రక్తచరిత్ర వివాదాలకు, అనుమానాలకు కలక్షన్లతోనే సమాధానం చెప్పింది. ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనే కేవలం ఐదు రోజుల్లో 5 .14 కోట్ల షేర్ వసూలు చేసింది. రక్తచరిత్ర తెలుగు వెర్షన్ ఓవర్ సీస్ లో దాదాపు కోటి రూపాయల షేర్ వసూలు చేసి ట్రేడ్ పండితుల విశ్లేషణ ప్రకారం విదేశాల వారు కామెడీ, రొమాన్స్ ఉన్న చిత్రాలను మాత్రమే ఆదరిస్తారు అన్న వాదనలను తోసిపుచ్చి కొత్తచరిత్ర సృష్టించింది. ఇక రక్తచరిత్ర 2 కూడా బాక్స్ ఆఫీసు బొనంజా అవుతుంది అని సి.కళ్యాణ్ నమ్మకంగా చెబుతున్నాడు. అదే జరుగుతుంది అని సినిమా ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రక్తచరిత్ర 5 రోజుల కలక్షన్లు
నైజాం: 1.8 కోట్లు
సీడెడ్: 1.25 కోట్లు
గుంటూరు: 50 లక్షలు
కృష్ణ: 35 లక్షలు
వెస్ట్ గోదావరి: 25 లక్షలు
ఈస్ట్ గోదావరి: 24 లక్షలు
నెల్లూరు: 20 లక్షలు
వైజాగ్: 53 లక్షలు
తోటల్: 5.14 కోట్లు


Click it and Unblock the Notifications











